జాను భర్త విజ్జు కదా..! ఈ నిజం మీకు తెలుసు కదా నాన్న..? మరి దానికి పుట్టిన బిడ్డకి ఆ నిజాన్ని ఎవరు చెబుతారు.
నా దగ్గర దాచి,జానుకి పుట్టిన బిడ్డ దగ్గర దాచి మీ అందరూ ఏం సాధించాలి అనుకున్నారు.
ఆ పుట్టిన బిడ్డకి తండ్రిని దూరం చేసి,నాకు తల్లి తండ్రిని దూరం చేసి ఎవరికి న్యాయం చేసారు నాన్న.
నాకు చెప్తే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండకపోయుండేదేమో కదా..! నాకెందుకు నాన్న ఇంత తీరని లోటును మిగిల్చారు.