అవును మావయ్య అంది వైదేహి
రేపు ఈ టైం వరకు కూడా నువ్వు అన్నం తినడానికి లేదు అయినా పొద్దున్నుంచి కడుపు కాలితే ఎప్పుడైనా హాయిగా తింటావ్ అనుకున్న కానీ ఇంత ఈగోకి తీసుకుంటావని అస్సలు అనుకోలేదు నువ్వు గాని రేపు సాయంత్రం వరకు ఏమైనా తిన్నట్టు చూస్తే అని వైదేహి వైపు అసహ్యంగా చూస్తూ ఇంకా ఏదో చెప్పేలోపే తన మొబైల్ మొగ్గడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు
చేసావుగా నేను ఒక్క మాట నీ గురించి బ్యాడ్ గా చెప్తే చాలు విరాట్ క్షణం కూడా దాన్ని ఆలోచించకుండా నమ్మేస్తున్నాడు ఇంతేనా నీకు నీ ప్రేమకి ఉన్న విలువ అడిగింది మీనాక్షి వైదేహి వైపు చూస్తూ