“ నా కూతురు విషయంలో తనకి ఇష్టం లేకుండా ఏదైనా చేయాలని చూసావో…!!” అని వేలు చూపించి కళ్ళు పెద్దవి చేసేసరికి.
ఆవిడ భయంతో.. “ క్షమించండి.. ఇంకెప్పుడు అమ్ముని ఏం అనను..!” అంది కంట్లో నీళ్లతో.
ఆమె కన్నీళ్లు చూసి విసురుగా వెనక్కి నెట్టేసిన ఫణీంద్ర ఆకాంక్ష గారి కోసం చూడకుండా పెద్ద పెద్ద అంగలతో ఆవేశంగా బయటకు వెళ్ళిపోయాడు ఫణీంద్ర.
ఫణీంద్ర విసురుడికి కింద పడిన ఆకాంక్ష మూడు నిమిషాలకి కాస్త తేరుకొని, జుట్టు సరిచేసుకుని మండపం బయటకు వచ్చేసరికి ఫణీంద్ర కార్ ఆ కాంపౌండ్ దాటితే.. ఆమె ముందు వచ్చి ఆగింది మరో కార్.
చేసేదేం లేక సైలెంట్ గా బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని కార్ లో కూర్చుంది ఆకాంక్ష.
@@@@