ప్రేమలో పడితే -28
“అంటే మీ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి నేను టైం ఇవ్వటం లేదు కాబట్టి నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతాను అంటున్నావా..?” అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు శ్రీరామ్.
“అవును సార్ అవును, నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడే క్వాలిటీ టైం లంచ్ టైం మాత్రమే. ఆ తర్వాత మా తాడిచెట్టు తో డిన్నర్ టైంలో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను. కానీ ఆ టైమ్ ని మీరు కీల్ చేస్తున్నారు. నాకు అది నచ్చటం లేదు. ఏ పని చేసినా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ చేయాలి అని నా కరెంటు పోల్ నాకు ఎప్పుడు చెప్తుండేవాడు. అదే విధంగా నేను చేస్తున్నాను కానీ మీరు కావాలి అని బలవంతంగా నన్ను ప్రతి చోట ఆపుతుంటే నాకు కోపం పెరిగిపోతుంది. ప్రెషర్ ఎక్కువవుతుంది దాంతో ఇష్టంగా వర్క్ చేయలేకపోతున్నాను అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను” అని తన ఫీలింగ్ అని చెప్పేసింది మహాలక్ష్మి..
“మీ ఫ్రెండ్స్ తో లంచ్ టైం లో కాకపోతే ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా” అని అడిగాడు శ్రీరామ్..
“నాకు అలా ఫోన్లో మాట్లాడటం నచ్చదు, అంతకుమించి మా ఫ్రెండ్స్ కి కూడా నచ్చదు ఏదైనా ఎదురుగా ఉండి మాట్లాడటమే, ఏదైనా ఇంపార్టెంట్ మేటర్ కలిసే టైం లేనప్పుడు ఫోన్లో మాట్లాడితే ఓకే, ఫోన్ ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకే యూస్ చేయాలి” అని చెప్పింది మహాలక్ష్మి.
శ్రీరామ్ ఆలోచనలో పడ్డాడు ఆమె అడిగినది కరెక్టే అనిపించింది ఆమె మాట్లాడే విధానం తనని కేర్ చేయకపోవడంతో ఆమె మీద కక్ష తీర్చుకోవాలి అని ఆ విధంగా ప్రెషర్ పెట్టాడు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతాను అంటే తనకి నచ్చటం లేదు.
అది కూడా జస్ట్ సిల్లీ రీసన్ కి తన ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి టైం ఇవ్వడం లేదు అని వెళ్ళిపోతాను అంటే తనకి కూడా గెల్టిగానే అనిపించడంతో టూ మినిట్స్ అని అతడు తన చైర్ లో కూర్చొని ఆమె ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ చూసి దాన్ని చింపేసి,,