హాస్పిటల్ లో ఉన్న కార్తీక్ మహికి స్పృహ వచ్చిందని తననే అడుగుతుందని ఫోన్ చేసి చెప్పడంతో.. తన గత ఆలోచనల నుండి బయటకు వచ్చిన విరాట్.. వెంటనే రూమ్ లాక్ చేసుకుని మహి లగేజ్ తో ఆ హోటల్ నుండి బయటకు వచ్చాడు.
అరగంట తర్వాత..
ఫుడ్ పార్సిల్ తో హాస్పిటల్ కి వచ్చిన విరాట్.. కార్తీక్ ను చూసి “ ఇక నువ్వెళ్ళి నీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని.. 9 లోపు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చెయ్ రా..? “ అని అతన్ని పంపించేసాడు.
ఏదో ఆలోచనలో ఉన్న మహిని చూసి, “ ఏయ్ డెవిల్ చించింది చాల్లే గానీ, లేచి కూర్చోవే తిందాం..నేనెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా..!” అని వెళ్ళాడు విరాట్.
తను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి కూడా ఇంకా ఆలోచనల్లోనే ఉన్న మహిని చూసి.. తన దగ్గరకి వెళ్లి నుదుటి మీద ఫింగర్స్ తో టాప్ చేస్తూ..
“ ఏంటే ఇంకా ఆలోచనల్లోనే ఉన్నావ్.. ఇంటికి వెళ్ళేది ఉందా..?? లేదంటే ఇంకా ఇక్కడే ఉంటావా..? “ అన్నాడు వెటకారంగా.