“డాడ్.. మహిని కాలేజీ లో జాయిన్ చేయాలి..!” అన్నాడు విరాట్.
“చెప్పానుగా విరాట్ నువ్వు విదేశాలకి వెళ్తేనే ఆ పిల్ల కాలేజీ లో అడుగు పెడుతుంది..!! నీ నిర్ణయం తన భవిష్యత్ ను నిర్ణయిస్తుంది.!” చెప్పింది భానుమతి
ఉఫ్.. అని గాడంగా ఊపిరి వదిలి.. “డాడ్ ఇదేనా మీ ఫైనల్ డెసిషన్.? “ అని అడిగాడు తండ్రిని.
“ సారీ విరాట్ నాకు తల్లిని కాదని నేనేమి చేయలేను.. అయినా నేనేం మహిని ఒంటరిగా వదులుతాననో.. లేక తన గురించి అస్సలు పట్టించుకోననో చెప్పట్లేదు.
చెప్తున్నాగా తనను నేనే చదివిస్తాను.. తను ఏం చదివుతా అన్నా.. ఎంత చదువుతా అన్నా కూడా ఖర్చుకి వెనకాడను..