వలయం -10
“మేడం ఏం జరుగుతుంది ఇక్కడ మనిషి చనిపోయారు మనీ క్లైమ్ చేయాలి అని చెప్పారు.. కానీ ఇక్కడేమో చూస్తుంటే మీరు చెప్పిన దానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు, నిజంగానే మనిషి చనిపోతే మీరు మనీ క్లైమ్ చేయాలి అనుకుంటున్నారా.? లేదంటే చనిపోయినట్లు క్రియేట్ చేసి మనీ తీసుకోవాలి అనుకుంటున్నారా..? అసలు ఏం చేయాలనుకుంటున్నారు” అని కోపంగా అడిగాడు క్లైమ్ ఆఫీసర్ అయినా రాజేష్.
“అయ్యో అటువంటిది ఏమీ లేదండి, అతను బాధలో అలా మాట్లాడుతున్నాడు, అంతకుమించి అతని భార్య మీద ఉన్న ప్రేమతో మనీ అవసరం లేదు అంటున్నాడు, ఆమె లేదు అన్నా డిప్రెషన్ లో ఉన్నాడు” అని వాళ్లకి చెప్పి,
” ఉదయ్ ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్ నాకు నిన్ను ఇలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిధి నీ సంతోషం కోరుకుంది నువ్వు బిజినెస్ లో బాగా డెవలప్ అవ్వాలి అనుకుంది. అందుకోసమే ఆ మనీని కట్టింది. నిధి ఏం చేసినా నీకోసమే, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు” అని అన్నది కల్పన..
ఉదయ్ కోపంగా ఆమె దగ్గరకు వచ్చి “కూడా కల్పన ప్లీజ్ ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్య రావద్దు. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థం అయింది నా పక్కన నా నిధియే లేనప్పుడు నాకు లైఫ్ ఫెయిల్ అయినట్లు అనిపిస్తుంది.. ఈ డబ్బు ఇవన్నీ నాకు నథింగ్” అని కోపంగా చెప్పి డోర్ క్లోజ్ చేశాడు.
కల్పన ఉదయ్ బాధని అర్థం చేసుకుంది, అంతకుమించి నిధి కోరుకున్నట్లుగా నేను చేయలేకపోతున్నానే అని ఫీల్ అయింది..