వలయం -9
ఉదయ్ హాస్టల్ కి వెళ్లి హాస్టల్ వార్డెన్ తో రమ్య గురించి అడిగాడు.
తను ఇక్కడే ఉందా ఫోన్ పని చేయడం లేదంట , వాళ్ల పేరెంట్స్ కంగారు పడుతున్నారు ఒకసారి తనని పిలుస్తారా నేను మాట్లాడతాను నేను తన బావని” అని చెప్పాడు..
“మీరేం మాట్లాడుతున్నారండి మాకు ఏమీ అర్థం కావడం లేదు, రమ్య ఎప్పుడో పది రోజుల క్రితమే ఏదో ఎగ్జామ్ ఉంది నేను ఢిల్లీ వెళ్తున్నాను, అటు నుంచి అటు మా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది. మీకు ఈ విషయం తెలియదా తిరిగి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారేంటి..?” అని అయోమయంగా అంతకుమించి అనుమానంగా అడిగింది హాస్టల్ వార్డెన్.
“అవునా తను ఎగ్జామ్ రాయడానికి ఢిల్లీ వెళ్ళిందా..?” అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు ఉదయ్.
వార్డెన్ అనుమానంగా “ఎవరు మీరు తన గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, తన పేరెంట్స్ వచ్చి అడగాలి మీకు తనకు ఏంటి సంబంధం, మిమ్మల్ని ఎప్పుడూ నేను రమ్య కోసం వచ్చినట్లుగా చూడలేదే” అని సీరియస్గా అడిగింది.