New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 13
వలయం Premium 6 min read

వలయం – 13

వలయం -13

 

“హో ఆ కేస్, గ్యాస్ సిలిండర్ పేలింది నిజం అమ్మాయి చనిపోయింది నిజం. అతని భర్త వచ్చి చనిపోయింది తన భార్య అనే నిర్ధారించడం నిజం, ఎందులో ఎటువంటి ఫేక్ న్యూస్ లేదు. కాకపోతే నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏమిటి అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె బాడీ ముక్కలు ముక్కలు అయింది ఆమె భర్త జరిగింది చూసి డిప్రెషన్ టెన్షన్ ఒక్కసారిగా ఎటాక్ కావటంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేసాం. అలానే ఆమె బాడీ పార్ట్స్ ని కూడా మార్చురీకి తరలించాం, ఇప్పటివరకు ఆ బాడీ పార్ట్స్ తీసుకోవడానికి అతని భర్త రాలేదు అదే ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు ప్రమోద్. 

 

“వాట్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటివరకు బాడీని మార్చడం నుంచి తీసుకొని వెళ్లకపోవడమేంటి. నిజమే చెప్తున్నారా లేదంటే వేరే కేస్ కి సంబంధించిన డీటెయిల్స్ నాకు చెబుతున్నారా..?” అని అనుమానంగా అంతకుమించి అయోమయంగా అడిగాడు రాజేష్.. 

 

“అయ్యో రాజేష్ ఇందులో నేను వేరే కేస్ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం నాకేంటి..? ఆరోజు జరిగింది ఇదే. ఆ తర్వాత ఆమె భర్త వస్తాడు ఏమో అని రెండు రోజులు కానిస్టేబుల్ ని హాస్పిటల్ దగ్గర ఉండమని చెప్పాను. కానీ అతను రాలేదు. నేను కూడా ఆ కానిస్టేబుల్ ని అక్కడ నుండి వచ్చేయమని చెప్పాను. 

 

అతను బాధలో ఉన్నాడు కదా తర్వాత వచ్చి తీసుకుని వెళ్తాడేమో అనుకున్నాను. అయితే ఇంక నాకు తెలిసి ఇప్పటివరకు తీసుకొని వెళ్ళినట్లుగా నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే ఒకవేళ అతను బాడీని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఇప్పటివరకు నాకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. అంటే దాని అర్థం తీసుకొని వెళ్ళటానికి రాలేదు అనే కదా” అని అన్నాడు ప్రమోద్. 

 

ఇదేంటి ఈ ప్రమోద్ ఎలా మాట్లాడుతున్నాడు నాకు ఏమీ అర్థం కావడం లేదే, అక్కడ ఉదయ్ మాటలు వింటుంటేనేమో భార్య మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఇక్కడేమో అంత రివర్స్ లో కనిపిస్తుంది అని ఆలోచనలో పడ్డాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue