వాంపైర్ సిటీ – 1
దేవ్ అరేయ్ దేవ్ ఇంకెంత సేపు పడుకుంటావ్ రా లే త్వరగా. కాలేజ్ కి టైం అవుతుంది. లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ కింద హాల్ నుండి వసుంధర కేకలు వేస్తుంది.
ఎంతకీ సమాధానం రాకపోయే సరికి “ఇలా కాదు చెప్తా వీడి పని” అని జగ్గు నీళ్ళు తీసుకుని వెళ్లి బెడ్ పైన పడుకున్న కొడుకు మొహం పై అమాంతం నీళ్ళు కుమ్మరించేసింది.
నీళ్ళు పడ్డా కానీ ఎలాంటి రెస్పాండ్ రాకపోయే సరికి వెళ్లి దుప్పటి తీసి చూసిన తనకి బెడ్ పై నిలువునా మనిషిలా ఉన్న దిండ్లు వెక్కిరిస్తూ కనబడ్డాయి.
ఎక్కడికి వెల్లుంటాడు వీడు అనుకుంటూ వెనక్కి తిరిగే సరికి ఎదురుగా చెట్టంత కొడుకుని చూసి “అమ్మో దేవుడా అంటూ ఉలిక్కి పడి, అంతలోనే తేరుకుని ఎదవ నన్నే బయపెడుతావ అంది దేవ్ రెండు చెవులూ మెలి తిప్పుతూ.
“లేకపోతే ఏంటి అమ్మ. నువ్వు ఇలా చేస్తావ్ అని తెలిసే ఇలా ప్లాన్ చేశా”
“చేశావ్ లే గొప్ప ఘనకార్యం. త్వరగా రెడీ అయ్యి వస్తే టిఫిన్ పెడతా” అంటూ బయటకి వెళ్తున్న వసుంధరను
“వసు అని ముద్దుగా పిలుస్తాడు దేవ్”
వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తుంది.
“ఎందుకు నా పైన అంత కోపం నీకు, నేను ఏం చేసాను వసు”
ఏమి తెలియనట్లు వేషాలు వెయ్యకు నా దగ్గర అంటుంది వసుంధర.
ప్రామిస్ వసు నాకు ఏం తెలీదు. నేను ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. అంతే కానీ ఇలా నా పైన కోపం చుపించకు.
“అయితే నేను చెప్పినట్టు చేస్తావా”
“హా చేస్తా చెప్పు”
“ఇప్పటి నుండి కాలేజ్ లో ఎవరితో గొడవ పడకూడదు”.
“అయ్యో వసు వాళ్ళే నాతో ఫస్ట్ గొడవ పెట్టుకుంటున్నారు. నేను కాదు”
“నేను ఇంకా చెప్పడం పూర్తి కాలేదు మై సన్”
హ్మ్మ్. సర్లే చెప్పు అని బెడ్ పైన కూర్చున్నాడు దేవ్.
వసుంధర కూడా వచ్చి పక్కన కూర్చొని దేవ్ మొహం నీ తన రెండు చేతులతో పట్టుకుని
” ఇప్పటికీ మూడు కాలేజ్ లు మారావు. ఎందుకు అందరితో గొడవ పడుతున్నవ్ అని టీ.సి ఇచ్చారు. ఇది నాలుగో కాలేజ్ ఇక్కడ కూడా సేమ్ కంప్లైంట్”
“అంటే అమ్మ ఎంత సీనియర్స్ అయితే మాత్రం అంత ఘోరంగా రాగింగ్ చేయాలా. నాకు నచ్చలేదు అందుకే కొట్టా “
“అదే ఆ కోపమే తగ్గించుకోవాలి. కాలేజ్ అన్నాక అవన్నీ కామన్ రా. ఆ విషయం పక్కన పెట్టు నీ బెంచ్ స్టూడెంట్స్ నీ ఎందుకు కొట్టావ్”
“వాళ్ళు కొంచెం ఓవర్ చేశారు”
“ఓవర్ అంటే “
“అబ్బ అమ్మా ప్రతిదీ చెప్పాలా” అంటూ విసుకున్నడు
“నేను చెప్పనా. నీకు సైట్ కొట్టారు దానితో నువ్వు వాళ్ళ చెంప పగల కొట్టావ్ అంతేనా”
“అమ్మవెనా నువ్వు అసలు. కొడుకుతో డిస్కస్ చేసే మాటలేనా ఇవి”
“రేయ్ టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి చూడకు. నీ వయసు పిల్లలు చుడు లవర్స్ తో సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతున్నారు. నువ్వు ఏమో లవ్ చేయడానికి ట్రై చేస్తే చెంపలు పగల కొడుతున్నవ్”
“వాళ్ళు అందరూ అందం, డబ్బు చూసి ట్రై చేస్తున్నారు. అయినా ఈ జనరేషన్ లో ట్రు లవర్ దొరకడం చాలా కష్టం. అయినా నాకు లవర్ లేదు అని ఎవరు అన్నారు”
ఆ మాట వినగానే ఆశ్చర్యంతో “ఎవర్ర ఆ అమ్మాయి”అని అడిగింది వసుంధర.
దానికి దేవ్ నవ్వుతూ ఇంకెవరు “నా ముద్దుల మమ్మీ నే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్” అన్నాడు
“నీతో నేను వాధించలేను కానీ, ఎవరితోనూ గొడవ పడకు నాన. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే, అర్థం చేసుకోరా. మీ నాన్న ఎదో కేసు విషయం అని నెల రోజులు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఆయనకి నువ్వు ఇలా గొడవ పడుతున్నావ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది వసుంధర.
“అమ్మా ఏంటిది. ఎందుకు ఏడుస్తున్నావు. సారీ అమ్మా. ఇంకెప్పుడు గొడవలు పడను. కోపం తగ్గించుకుని, ఎలాంటి కంప్లైంట్స్ ఇంటికి రాకుండా చూసుకుంటా. సరేనా ఎవడవకు వసు” అంటూ ఒదార్చి
” సరే పద నాకు ఆకలి వేస్తుంది. ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తా” అంటూ బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.
” దేవుడా వీడి కోపం తగ్గించే మంచి అమ్మాయిని వీడి జీవితంలోకి వచ్చేలా చెయ్యి స్వామి. నీకు వేయిన్ని ఒక్క కొబ్బరికాయలు కొడతా” అంటూ మనసులో అనుకుంటూ ఉండగా బాత్రూం నుండి
“వసు మాతాజీ. ఇది కలి యుగం. నువ్వు ఎక్కడ వెతికినా నీకు మంచి అనేది కనపడదు. ఒకవేళ కనపడితే నేనే తీసుకు వచ్చి నీ ముందు నిలబెడతా లే. వెళ్లు” అని దేవ్ అన్నాడు.
హ్మ్మ్ అని ఒక నిట్టూర్పు విడిచి వంట గదిలోకి వెళ్ళిపోయింది వసు.
@@@@@@@@@@@@@@@@@@@@@
హిమాలయాలు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో పెద్ద అడవి. దట్టమైన చెట్లతో నిండి పగలే రాత్రిని తలపిస్తోంది. ఆ అడవిలో ఒక అందమైన నగరం. అదే వాంపైర్స్ నివసించే ద సిటి ఆఫ్ వాంపైర్ నగరం.
అందమైన పెద్ద పెద్ద అద్దాల మేడలు. ఆ ఇల్లు చుట్టూ పూల తీగలు అల్లుకుని, ఆ పూల పై మంచు పడుతూ చూడడానికి స్వర్గాన్ని తలపిస్తోంది.
కొన్ని వేల సంవత్సరాల నుండి వాంపైర్స్ అక్కడ జీవిస్తున్నారు. రక్తం కోసం మనుషులను ఇబ్బంది పెట్టకుండా వారికి రక్తపు నది ప్రవహిస్తూ వారి రక్త దాహాన్ని తీరుస్తుంది.
అంతటి అందమైన ప్రదేశంలో నీ వాంపైర్స్ ఇప్పుడు భయం, భాదతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్నారు.
ఆ నగర రాజు చoపబడి ఉన్నాడు. రాణి అయిన ధృసిలా తన భర్తను కోల్పోయిన భాధలో మునిగిపోయింది. తన కూతురు భందిచబడి ఉంది.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిలబడి ఉంది దృసిలా.
“లేదు నేను ఇలా నిస్సహాయంగా ఉంటే నా కూతురిని కూడా కోల్పోతాను. అలా జరగడానికి వీలు లేదు” అని మనసులో అనుకుని
“ఆర్మండ్ నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి. వెన్ను పోటు పొడిచి నా భర్తను చంపినత సులభం కాదు నన్ను చంపడం. మర్యాదగా నా కూతురిని వదిలి పెట్టు” అని ఆవేశంగా తన శక్తిని ప్రయోగించింది.
తన చేతులలో నుండి ఒక కాంతి వెలువడి అది నేరుగా ఆర్మండ్ ఉదర భాగం కి తగలగానే ఆ శక్తిని తట్టుకోలేక కింద పడ్డాడు.
హా హా హా హా హా అని నవ్వుతూ పైకి లేచి “నా సొంతం కావలసిన దానివి ఎందుకు పనికి రాని దద్ధమ్మని చేసుకున్నావ్. చూడు ఒకే ఒక దెబ్బకి చచ్చాడు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఏం అంటావ్” అని అడిగాడు.
“చీ దుర్మార్గుడా నీ అంతు చూస్తా” అని తన కత్తిని బయటకు తీసి దాడి చేసింది.
ఆర్మండ్ ఒడుపుగా తప్పించుకుంటూ తనకి ఏ మాత్రం హని చేయకుండానే ఎదుర్కొంటున్నాడు.
అలా దాదాపు అర గంట సాగిన పోరాటంలో ధృశిలా శక్తి క్షీణించి కింద పడబోయింది.
వెంటనే తన కూతురు తప్పించుకుని వచ్చి అమ్మా అంటూ పట్టుకుని అలాగే కింద కూర్చుంది.
“మెహర్ నువ్వు ఎలా అయిన తప్పించుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను”
” అమ్మా నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను. వాడి సంగతి నేను చూసుకుంటా” అని లేవబోయిన కూతురు చెయ్యి పట్టుకుని
“లేదు తల్లి వాడిని మనం ఇప్పుడు ఏమి చేయాలేము. వాడి దగ్గర ఎదో మంత్ర శక్తి ఉన్నట్టు నాకు తెలుస్తుంది. వాడిని ఎదుర్కునే సమయం ఇది కాదు. నువ్వు వెంటనే దక్షిణం వైపు వెళ్లు. అక్కడ నీకు సహాయం దొరుకుతుంది” అని చెప్తుంది.
“మరి నీ సంగతి ఎంటి అమ్మా” అని కళ్ళ నిండా నీళ్లతో అడుగుతుంది మెహర్.
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆర్మండ్ వారి పక్కకి వచ్చి “అబ్బబాబ్బా నువ్వే అనుకుంటే నిన్ను మించిపోయింది నీ కూతురు” అంటూ మెహర్ నీ తాకబోయాడు అంతలోనే ఎదో షాక్ కొట్టిన వాడిలా రెండు అడుగులు వెనక్కి వేశాడు.
ఎంటి అని చూస్తే ధృసిలా తమ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పచింది.
“చూడు నువ్వు నా కూతురి జోలికి వస్తె నీ ప్రాణం తీస్తా జాగ్రత్త” అని హెచ్చరించింది.
ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ అక్కడ వారితో ఎదో మాట్లాడి వెనక్కి చూసే సరికి అక్కడ మెహర్ లేదు.
వెంటనే “అది తప్పించుకోవడానికి వీలు లేదు. వెంటనే వెళ్ళి దాన్ని తీసుకుని రండి అని చెప్పగానే పది మంది వాంపైర్స్ అక్కడి నుండి వెళ్లారు.” కాసేపటికి తిరిగి వచ్చి ఎక్కడా కనిపించలేదు అని చెప్పారు.
ఆఆ………. అంతలోనే ఎలా మాయం అయిపోయింది అంటూ కోపంతో వెతకడానికి వెళ్లిన వాంపైర్స్ ఇద్దరినీ చంపేశాడు.
“మీకు ఇదే గతి పట్టకూడదు అంటే వేల్లి దాని తీసుకుని రండి. అది నాకు కావాలి. లేదంటే మీ ప్రాణాలు పోతాయి” అని చెప్పి “మీరు రాణి గారిని జాగ్రత్తగా చూసుకోండి నేను తర్వాత వస్తా” అని పని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు.
మెహర్ నీ వెతకడానికి మిగిలిన వాంపైర్స్ బయలు దేరి వెళ్లారు.
@@@@@@@@@@@@@@@@@
శివాలయం జనాలు వచ్చి పోతున్నారు. దేవుడి ముందు ఒక అమ్మాయి నిలబడి ఉంది. పూజారి గారు వచ్చి తన చేతిలోని కొబ్బరికాయ, కర్పూరం, అగర్బత్తిలు తీసుకుని “అమ్మా తమరి నామ ధ్యేయం, గోత్రం చెప్పండి అర్చన చేస్తాను” అని అడిగారు.
“మాయ పూజారి గారు. గోత్రం తెలీదు” అని చెప్తుంది మాయ.
“పర్వాలేదు అమ్మా” అని అర్చన చేసి కొబ్బరికాయ కొట్టి మాయకి ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన.
“శివయ్య నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్న. అమ్మా, నాన్న లేకపోయినా అన్ని నువ్వే అనుకుని బ్రతుకుతున్న. నా మొహాన కొంచెం ధైర్యాన్ని పడేయచ్చు కదయ్యా. ఎవరు చూసినా ఏం అనట్లేదు అని నన్నే ఎడిపిస్తున్నారు.
ఈ రోజు ఫస్ట్ డే కాలేజ్ కి. ఎవరు నన్ను ఎడిపించకుండ నువ్వే చూసుకోవాలి”. అని తన భాధలు ఆ శివుడికి చెప్పుకుని కాలేజ్ కి బయలు దేరింది.
కాలేజ్ క్యాంపస్ లోకి అడుగు పెట్టింది భయపడుతూనే.
“శివయ్య ఎవరు నన్ను ర్యాగింగ్ చేయకుండా నువ్వే చూసుకో ” అని మనసులోనే దేవుడిని వెయ్యి సార్లు మొక్కుకుంది.
ఆ దేవుడు తన మొర ఆలకించాడు ఏమో ఎవరు తనని కనీసం పట్టించుకోలేదు. “చాలా థాంక్స్ శివయ్య” అనుకుంటూ ఫాస్ట్ గా తన రూం కి వెళ్ళి సెకండ్ రో లో లాస్ట్ బెంచ్ లో కూర్చుంది.
ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటే చుట్టూ చూసింది. అందరూ తన వైపే విచిత్రంగా చుస్తునారు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
To be continued…..
ఎందుకు అందరూ మాయ నీ అల చూస్తున్నారు?
అసలు మెహర్ ఏమైంది?
దేవ్ ప్రేమించే అమ్మయ్ మెహర్ లేదా మాయ?
అసలు తను ప్రేమలో పడుతాడ?
Swipe left/right or tap the sides to turn pages