వాంపైర్ సిటీ – 2
ఎజుకేషన్ కాబట్టి అందరూ కలిసే కూర్చుని ఉన్నారు. అమ్మాయిలు సపరేట్, అబ్బాయిలు సపరేట్ కాకుండా ఎవరికి నచ్చిన వాళ్ళతో వారు కూర్చున్నారు.
ఏంటి ఇది ఇలా చూస్తున్నారు నా వంక అని మనసులో అనుకుంటూ తల కిందకి దించుకుంది మాయ.
పక్కన బెంచ్ అమ్మాయి లేచి వచ్చి “హాయ్ నా పేరు అంజలి అంజు అని పిలవచ్చు” అని చెయ్యి ముందుకు చాపింది.
మాయ తన చేతిని అంజు చేతికి అందిస్తూ ” మాయ” అని చెప్పింది.
” కొత్తగా చేరావా కాలేజ్ లో ” అని అడిగింది అంజలి.
అవును అన్నట్టు తల ఊపింది మాయ.
” హో ఒకే. అందరూ నీ వంక ఎందుకు అలా చూస్తున్నారు అనే కథా ఆలోచిస్తున్నావు ” అంది అంజు.
అవును అన్నట్టు తల ఊపుతుంది మాయ.
” దానికి కారణం దేవ్ ”
” దేవ్ ఎవరు ” అంటూ ఏం అర్థం కాక అడిగింది.
” హ్మ్మ్ ఇలా రా ” అని మాయ చెయ్యి పట్టుకుని తన బెంచ్ దగ్గరకి తీసుకుని వెళ్లి మిగిలిన ఇద్దరికీ ” హే గాయ్స్ తను మాయ న్యూ జాయినింగ్, మాయ తను హేమ అండ్ తను కావ్య ” అని పరిచయం చేస్తుంది.
మాయ హాయ్ అని చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చుంది.
అంజలి మాట్లాడుతూ ” ఈ క్లాస్ ఏంటి, దేవ్ ఎవరు, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని డౌట్ ఉంది కదా నీకు ”
మాయ హ్మ్మ్ అని తల ఊపుతుంది.
” ఎందుకు అంటే అది ఎవరికి అర్థం కాని క్యారక్టర్. ఎవరితో మ్లాడడడు. అమ్మాయిలతో అయితే అసలు మాట్లాడడు, కనీసం చూస్తే ఒట్టు. ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. తనని చూడాలి అంటే కూడా భయం. చాలా రుడ్ గా బిహేవ్ చేస్తాడు “
” ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు ” అని అయోమయంగా అడిగింది మాయ.
” ఒక్క ముక్కలో చెప్తా విను, మనిషి చూడడానికి అచ్చుం హీరో లా ఉంటాడు. కానీ పొరపాటున ఎవరైనా తనకి ప్రపోస్ చేయాలి అని ట్రై చేసినా చంపలు పగులుతాయి. అలా చెంపలు పగిలిన వాళ్ళలో మేము ముగ్గురం ఉన్నాము ” అని చెప్పగానే మాయ కళ్ళు, నోరు రెండు పెద్దవి చేసుకుని
” ఏంటి కొట్టాడా ” అని ఆశ్చర్యంగా అడిగింది.
ముగ్గురు అవును అన్నట్టు తలలు ఉపారు.
” అందుకే నువ్వు జాగ్రత్తగా ఉంటావ్ అని ముందే చెప్తున్నాం ” అని చెప్పారు ముగ్గురు.
సరే అని వెళ్లి తన బెంచ్ లో కూర్చుంది.
” ఏంటి శివయ్య, నేను ఏమి అన్యాయం చేసానయ్య నీకు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఇరికిస్తావ్ అనుకోలేదు. బయట ఎవరు నన్ను ఏమి అనలేదు అని సంతోషించే లోపే ఈ ట్విస్ట్ ఏంటి అయ్యా.
అయినా నేను తనతో మాట్లాడితేనే కథా సమస్య. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని చూడకూడదు. మాట్లాడకూడదు “
అని మనసులో అనుకుని తన బాగ్ లో నుంచి ఒక పుస్తకం తీసుకుని అందులో తల దూర్చేసింది.
పది నిమిషాల తరువాత టీచర్ వచ్చింది క్లాస్ లోకి. అందరూ లేచి నిలబడ్డారు. కూర్చోండి అని చెప్పి ఆమె కూడా తన చైర్లో కూర్చుంది. క్లాస్ మొత్తం ఒకసారి చూసి ఆ దేవ్ ఇంకా రాలేదా అని అడిగింది.
నో….. మామ్ అని అన్నారు అందరూ.
మాయ బెంచ్ వైపు చూసి న్యూ జాయినింగా అని అడిగింది.
అవును మామ్ అని సమాధానం ఇచ్చింది మాయ.
” దేవ్ నీ బెంచ్ మెట్, తను ఈ క్యాంపస్ లోనే ఉంటాడు. వెళ్లి జాను మామ్ పిలుస్తున్నారు అని చెప్పి తీసుకుని రా ” అని చెప్పారు.
మాయ వెంటనే కంగారుగా ” మామ్ నేనా ” అంటూ అడిగింది తననో కాదో అన్న సందేహంతో.
” యా నువ్వే వెళ్లి త్వరగా తీసుకుని రా ” అని చెప్పేసరికి ఇంకా చేసేది ఎం లేక బయటకు వచ్చింది.
క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యాడు దేవ్. సీనియర్స్ అందరూ రాగింగ్ అంటూ పనిష్మెంట్ అంటూ ఎదోదో చేస్తున్నారు. అక్కడ ఒక ఐదు మంది గ్రూప్ గా ఉన్నారు. అందులో ఒకడు ” హే ఇలా రా ” అంటూ దేవ్ నీ పిచాడు.
దేవ్ పట్టించుకోకుండా తన రూం కీ తను వెళ్తుంటే అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. దేవ్ సూటిగా అతని కళ్ళలోకి చూసాడు.
” ఏంటి మొన్న మా వాడిని కొట్టావ్ అంటా. ఎవరు లేనిది చూసి ఒక్కడినే కొట్టడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా ” అని అన్నాడు .
” చూడు ఆది, ఆ రోజు తానే నాతో ఫస్ట్ గొడవ పెట్టుకున్నాడు. నా తప్పు ఏం లేదు. నేను అన్ని మర్చిపోయా, మీరు మర్చిపోండి ” అని చెప్పి తానే పక్కకు తప్పుకుని రెండు అడుగులు వేయగానే
” ఏంట్రా ఆది అని పేరు పెట్టి పిలుస్తున్నావ్. సీనియర్ అన్న గౌరవం కూడా లేదా ” అని వెటకారంగా అన్నాడు.
” ఒకే బ్రో. నా తప్పు ఏం లేదు ఇక నేను వెళ్తాను ”
” ఏంటి భయపడుతున్నావా. దమ్ముంటే రా చుస్కుందాం” అని ఎంత రెచ్చ గొట్టినా తన కోపాన్ని ఆపుకుంటూన్నాడు.
” చూడండి బ్రో ఎదో అనుకోకుండా జరిగిపోయిన విషయాన్ని పెద్దది చేయకండి అంటూ ఉండగా ” అక్కడికి మాయ వస్తుంది.
” ఇక్కడ దేవ్ అంటే ఎవరు ” అని అడిగింది.
నేనే ఏంటి అని బెస్ వాయిస్ తో చెప్పే సరికి దేవ్ వంక తిరిగి తన మొహం కూడా చూడకుండా ” మిమ్మల్ని జాను మామ్ పిలుస్తున్నారు. కొంచెం త్వరగా రండి, క్లాస్ కి టైం అవుతుంది అంటా ” అని చెప్పి వెళ్ళిపోయింది.
ఫస్ట్ టైం ఆశ్చర్య పోవడం దేవ్ వంతు అయ్యింది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎవరు తనతో ఇలా మిమ్మల్ని, రండి అని మర్యాదగా మాట్లాడింది లేదు. అందరూ పేరు పెట్టీ, ఇంకా చనువు పెచుకోడం కోసమే మాట్లాడేవారు. అందులో అసలు తన వంక కూడా చూడకుండా చెప్పి వెళ్లిపోతుంది అని మనసులో అనుకుని మాయ వైపు చూసాడు.
పింక్ కలర్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని దాని పైకి గోల్డ్ కలర్ చున్ని, చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ, నడుము వరకు వదిలేసిన నల్లని కురులు, మంచు లా తెల్లటి శరీరం చూడడానికి దేవ కన్యలా ఉంది.
ఆది ఆ అమ్మాయిని చూసి ” అబ్బా ఏముంది రా ఫిగర్, దీన్ని ఎలా అయినా పడేయ్యాల్లి ” అని మనసులో అనుకుని
” సరే దేవ్ ఇక నువ్వు వెళ్ళు” అని అన్నాడు.
దేవ్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తన రూం లోకి వెళ్ళాడు.
” ఈ సారి ఎవరితో గొడవ పడి వస్తున్నావు ” అని అడిగింది జాను మామ్.
” లేదు మామ్ నేను ఎవరితో గొడవ పడలేదు. సీనియర్స్ మాట్లాడుతుంటే కొంచెం లేట్ అయ్యింది ” అని సమాధానం చెప్పాడు.
” హ్మ్మ్ ఒకే వెళ్లి కూర్చో ” అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేసింది.
దేవ్ తన బెంచ్ వైపు నడిచాడు. తన పక్కన సీట్ లో మాయ కూర్చుని ఉంది. ఈ అమ్మాయి ఏంటి నా బెంచ్ లో కూర్చుంది అని మనసులో అనుకుంటూ వెళ్లి తన పక్కన కూర్చున్నాడు.
మాయకు లోపల ఎంత టెన్షన్ ఉన్నా బయటకి కవర్ చేస్తూ దేవ్ వంక చుడకుండ బోర్డ్ వైపే చూస్తోంది.
” చాలా విచిత్రంగా ఉంది ఈ అమ్మాయి ” అనుకుని దేవ్ కూడా ఎక్కువ పట్టించుకోకుండా క్లాస్ పై దృష్టి పెట్టాడు.
@@@@@@@@@@@@@@@@@@
ఇప్పుడు వాంపైర్ రాజ్యం మొత్తం అతని ఆధీనంలోనే ఉంది. ఆర్మండ్ తన కింద పని చేసే ఒక వాంపైర్ నీ పిలిచి అందరినీ ఒక దగ్గర సమావేశ పరచమని చెప్పి తను రాణి కోట వైపు అడుగులు వేశాడు.
ధృసిలా భర్త చనిపోవడం, మెహర్ దూరం అవ్వడంతో రోజు రోజుకీ కృంగి పోతుంది. తన కూతురు ఎక్కడ ఉందో ఎలా ఉందో అన్న ఆలోచన తనని ఉండనివ్వడం లేదు.
కూతురు గురించి ఆలోచనలో ఉన్న దృసిలా ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించడంతో అటు వైపు చూసింది.
ఆర్మండ్ వచ్చి తనకి ఎదురుగా నిల్చున్నాడు. తనని చూడగానే ధృశిలా మొహం తిప్పుకుని వెళ్లి కిటికీ దగ్గర నిల్చుంది.
ఆర్మండ్ వెళ్లి తనకి ఇంచ్ దూరంలో నిలబడ్డాడు. ఎవరో వెనక ఉన్నట్టు అనిపించి తిరిగి చూసిన ధృశిలా ఆర్మండ్ నీ అంత దగ్గరగా ఉండడం చూసి ఒక్క అడుగు వెనక్కి వేసింది కానీ అడుగు తడబడడంతో వెనక్కి పడబోయింది.
వెంటనే ఆర్మండ్ తన చెయ్యిని పట్టుకునీ తన పైకి లాకున్నాడు. అలా లాగడంతో విసురుగా వచ్చి ఆర్మండ్ పై పడింది ధృసిలా. వెంటనే వెనక్కి జరుగుదాం అనుకుంది కానీ తన నడుము చుట్టూ బలమైన చేతులు బిగుసుకోవడంతో ఎటు కదలలేక పోతుంది.
” ఏం చేస్తున్నావ్. మర్యాదగా వదులు నన్ను ” అని కోపం నిండిన కంఠంతో అంది.
” ఇంత అందమైన అమ్మాయి, ఇంత దగ్గరగా ఉంటే బుద్ధి ఉన్న మగాడు ఎవడైనా వదులుతాడా చెప్పు ” అన్నాడు.
” నీ నీచపు బుద్ధిని నా దగ్గర చూపించకు ” అని విసురుగా ఆర్మండ్ ను వెనక్కి నెట్టడంతో అతను వెనక్కు పడబోయి నిలతొక్కుకున్నాడు.
కోపాన్ని ఆపుకుంటూ ” చూడు డార్లిగ్ నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి తప్పదు. ఎందుకు అంటే ఈ వాంపైర్ సిటి ఇప్పుడు నా అదుపు ఆజ్ఞాలలో ఉంది. నేను అనుకుంటే ఏమైనా చేయగలను. వెంటనే నీ కూతురిని ఇక్కడిగి రప్పించు. లేదంటే ఎవరు ప్రాణాలతో మిగలరు ” అన్నాడు.
” నువ్వు ఏం అయినా చేసుకో నేను మాత్రం నా కూతురు ఎక్కడ ఉందో చెప్పను. నీ చావు తన చేతిలోనే. గుర్తు పెట్టుకో “
హా హా హా హ హా అది చూద్దాం అనేసి అక్కడి నుండి బయటకు వెళ్లాడు.
@@@@@@@@@@@@@@@@@@@@
సాయంత్రం 4 గంటలు. కాలేజ్ అయిపోయింది. అందరూ బాగ్స్ సర్దుకుని వెళ్తున్నారు. మాయ ఎదో ఆలోచిస్తూ అలాగే కూర్చుంది.
” మాయ ఏంటి ఆలోచిస్తున్నావ్. కాలేజ్ అయిపోయింది. బయలుదేరు” అన్న అంజలి మాటకి ” హా మీరు వెళ్ళండి నేను వస్తాను ” అని చెప్తుంది.
క్లాస్ లో అందరూ వెళ్ళిపోయాక తను కాసేపు ఉండి బ్యాగ్ తీసుకుని బయలుదేరి బయటకు వచ్చింది.
చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప. అలా నడుచుకుంటూ వెళ్తున్న తనని ఎవరో
చెయ్యి పట్టి రూం లోకి లాగి డోర్ లాక్ చేశారు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
To be continued…………..
నచ్చితే దయచేసి సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swipe left/right or tap the sides to turn pages