మరి అలా మూర్ఖంగా మాట్లాడకు ఎంతైనా కన్నతల్లి కదా??
అలాంటి సెంటిమెంట్స్ నీకు ఉంటాయి అక్క కానీ నేను అప్పుడే వదిలేశానువాళ్ళని…నువ్వు కొత్తగా మళ్లీ బాధ్యతలు నేర్పకు నాకు….
నేర్పల్సిన అవసరంలేదురా నేను చెప్పినా చెప్పకపోయినా పిన్నిని చూడాల్సిన బాధ్యత నీదే…
నువ్వు చూడకపోయినా పరవాలేదు నిన్ను సహాయం చేయమని మేము అడగడంలేదు
ఒక్కసారి వచ్చి కనపడిపో…. ఆమెకు హ్యాపీగా ఉంటుంది ఇదొక్కటే నేను అడుగుతున్నాను నేను అంటుంది ప్రాప్తి…
బ్రతికున్నంత కాలం ఎవరిని హ్యాపీగా ఉండనిచ్చిందని?? ఆమెకు హ్యాపీనెస్ కావాలి