మిల్క్ పౌడర్ బ్రాండ్ చెప్పి అలాగే బాబుకి మిల్క్ పట్టడానికి బాటిల్, డైపర్స్ కూడా ఇవ్వమని చెప్పింది శుభశ్రీ.
“ఓకే మేడం..” అని అన్నాడు మెడికల్ అతను.
“సార్ మీరు తొందరగా అవి తీసుకొని రండి.. పని ఉంది.” అని చెప్పింది చందు కి ఫోన్ లో శుభశ్రీ.
“ఓకే మేడం.. ఈ మెడికల్ హాస్పటల్ కి దగ్గర్లోనే ఉంది జస్ట్ 15 నిమిషాల్లో వచ్చేస్తాను..” అని చెప్పి ఫోన్ కట్ చేశాడు చందు.