New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైల్డ్ బిస్ట్ – 20

వైల్డ్ బిస్ట్ – 20

ఇంకా కన్నీళ్లు కార్చే ఓపిక లేదు అని కళ్ళు వెలవెల పోతుంటే.. ఇది చూడడానికా ఇంకా బ్రతికి ఉన్నాను నేను అని గుండె కొట్టుకుంటూ,ఇక నేను కొట్టుకోవడం ఆపేస్తాను అని మొండికేస్తూ ఉంది.. 

 

 

తల్లిదండ్రుల ముందు బిడ్డలు పోతే ఆ తల్లిదండ్రులకి ఎంత నరకంగా ఉంటుందో, అదే తల్లిదండ్రులు వాళ్ళ ముందు పోతే ఆ బిడ్డలకి కూడా అంతకంటే ఎక్కువ నరకంగా ఉంటుంది అని అర్జున్ కి తెలిసి వచ్చింది ఆ క్షణం..

 

కానీ..! ఇంకో క్షణం కూడా అక్కడ ఉండలేను అని మనసు పోరు పెడుతూ ఉంటే.. వాళ్లని చూసే ధైర్యం లేదు అని వెన్ను వెనుతిరిగింది.

 

 

అర్జున్ రావట్లేదు అని వెనకకు తిరిగిన శుభశ్రీకి.. వెళ్లడానికి వెనకకు తిరిగిన అర్జున్ కనిపించాడు.

 

 

ఫాస్ట్ గా రెండు అడుగులు వెనకకు వేసి అర్జున్ చేయ్యిని పట్టుకొని తన వైపుకు తిప్పుకుంది శుభశ్రీ.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue