రితి 😘 యోగ
యోగ నీకు నిజాలు ఇప్పుడే చెప్తే నువ్వు నాతోనే ఉంటావా అని అడుగుతాడు…
చెప్పు నేను నిన్ను వదిలేయను లే అంటుంది రితి… యోగ నేను మీ అన్న ఫ్రెండ్స్ కాదు ఆ రోజు హోటల్ మీటింగ్ కి అక్కడికి వచ్చాను… మీటింగ్ అయిపోయాక రిటర్న్ ఆఫీస్ కి వెళ్దాం అనుకున్న కానీ నిన్ను చూసి ఆగిపోయాను… నీతో మాట్లాడాలి అనుకున్న నువ్వే వచ్చావ్ డ్రాప్ అన్నావ్ మీ అన్న ఫ్రెండ్ అన్నావ్ నాకు కావాల్సింది అదే కాబట్టి నేను ఎం మాట్లాడలేదు అంటాడు యోగ….
రితి యోగ నీ చూస్తూ నీలో ఈ యాంగిల్ కుడా ఉందా పద వెళ్దాం అంటుంది… ఏయ్ మాట్లాడవా నాతో అంటాడు…