ప్రేమలో పడితే -29
“అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు, నేను వచ్చాను కదా ఇకపైన రోజు వస్తాను నా గురించి మీరు మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజు స్పెషల్ ఏం తెచ్చారు నాకు బాగా ఆకలిగా ఉంది” అంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది మహాలక్ష్మి.
“వావ్ ఈరోజు ఆంటీ గుత్తి వంకాయ చేశారా..? నాకు చాలా ఇష్టం అని నీకు తెలుసు కదరా” అని గణేష్ బాక్స్ తను తీసుకొని,
” ఈరోజు తాడిచెట్టు బీరకాయ చేశాడు నువ్వు తినేసేయ్ రా” అని తన బాక్స్ గణేష్ ముందు పెట్టి “రమ్య ఈరోజు నీ దగ్గర స్పెషల్ ఏంటి..?” అని అడిగింది..
వెజిటేబుల్ రైస్ అని చెప్పటంతో,
” అబ్బా మీరేమో రోజు స్పెషల్స్ తింటున్నారు నాకేమో తాడి చెట్టు చేసిన ఫుడ్” అని అనుకుంటూ వాళ్ళిద్దరితో మాట్లాడుతూ కడుపునిండా తిన్నది.
గణేష్ ఏమో నార్మల్గా ఫుడ్ తినేశాడు. కానీ రమ్య మాత్రం మహాలక్ష్మి వైపు చూస్తూనే ఆలోచిస్తూ ఫుడ్డు తిన్నది.
“అబ్బా ఈరోజు నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పది రోజులు కూడా మీతో కలిసి లంచ్ చేయకుండా మాట్లాడకుండా ఉంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ తెలుసా..?” అని వాళ్ళ వర్క్ ప్లేస్ లోనికి వచ్చి కూర్చున్న తర్వాత అన్నది మహాలక్ష్మి..