ఇరవై నిమిషాలు విరాట్ డీపీ నే చూస్తూ గడిపేసిన అమ్ముకి, అతను ఆఫ్లైన్ వెళ్లడం తెలియగానే మళ్ళీ ఆమె కన్నీరు పిల్లోలోకి ఇంకిపోయాయి.
@@@@
నెక్స్ట్ డే మార్నింగ్..
రాత్రి ఎలాగోలా అతి కష్టంగా అతని మనసుకి సర్ది చెప్పుకున్నా విరాట్.. ఎప్పుడెప్పుడు తెల్లరుతుందా అని నిముషాలు లెక్కపెట్టుకుంటూ…ఆ రాత్రిని కరిగించేసాడు.
తెల్లవారి ఎవరు ఇంకా లేవకముందే అమ్ము ఇంటికి వెళ్లిపోయాడు ఇంకా అతని మనసుని ఆపలేక.
ఇంటి అల్లుడని పనివాళ్ళకి వాచ్మెన్ కి అందరికి తెలిసే ఉండడంతో నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు విరాట్.