“బామ్మా… ఆ పాప చెప్పిన విషయాలన్నీ నాకు గుర్తున్నాయి. తను చెప్పిన అడ్రస్ కూడా గుర్తుంది. రేపు ఉదయం లేవగానే ఆ లెటర్ రాస్తాను. కనీసం తన తల్లికైనా తన కూతురికి ఏం జరిగిందో తెలియాలి కదా!” అంది చిత్ర.
రుక్మిణి గారు మనవరాలి తలపై చేయి వేసి నిమిరారు.
“సరే తల్లీ… నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి.” అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు.
చిత్ర బామ్మ భుజంపై తల వాల్చింది.
ఆరోజు చిత్ర ఆలోచన అంతా ఆ చిన్నారి గురించే ఎందుకు అలా చేస్తారు? అలా కూడా మనుషులు ఉంటారా అనే సందేశం ఆమె మనసులో పుట్టించింది.
ఆరోజు అలా గడిచిపోయింది.