సమ్మోహనం – 3
తనను మీట్ అవ్వాలి అనుకుంటూ,
హాల్ లో అమ్మ పిన్ని ఉన్నారని చూస్కొని గెస్ట్ రూమ్ వైపు బ్యాక్ డోర్ నుండి వెల్లాడు.
బెడ్ మీద కూర్చున్న హాసిని,
బాల్కని డోర్ తీసుకున్న హర్ష ని చూసి,
దొంగ!! దొంగ అని అరిచింది రెండు సార్లు.
గుర్తుందా హాసిని హర్ష ని చూడలేదు.
హర్ష వెంటనే ఫాస్ట్ గా రియాక్ట్ అయి, వచ్చి హాసిని నోరు మూసేసాడు.
నిజంగానే దొంగ అని లేచిన వైషు అక్కడ బావ ని చూసి పక్కనున్న అక్కని చూస్తూ ఉంది.
కాని ఆ అరుపుకే ఇంట్లో ఆడ లేడీస్ అందరూ గడియ పెట్టని రూమ్ లోకొచ్చేసి, ఇద్దరిని ఆ పొసిషన్ లో చూసి,
వాల్లు కూడా సిగ్గుపడ్డారు.
భ్రమర గారు హర్ష చెవి మెలేస్తూ,
రేయ్ ఈ రోజు రాత్రి కే కార్యం ఉంది, అప్పటి వరకు కుదుటగా ఉండు!!
నీకు అన్నీ మీ తాత వేషాలొచ్చాయి రా అంటూ,
వీడు గీత దాటితే నాకు చెప్పమ్మా!! అని షాక్ లో ఉన్న హాసిని ని కదిపేసి అందరూ వెల్లిపోయారు.
అక్కా!! బావ ని చూసా అరిచావ్?? అంటూ వైషూ కూడా పడకేసింది.
హాసిని ని బాల్కని లోకి తీస్కెల్లాడు హర్ష,
ఒక బొమ్మ లా వెల్లింది తను కూడా!!
హర్ష ని చూస్తూ, ఈయనేనా!! అనుకుంది అంతే!!
తన నోటి మీద చేయి తీసేస్తూ,
ఎందుకు అంతలా అందులో దొంగ అని అరిచావ్ నన్ను చూడనట్టు, నా ఫేస్ తెలియనట్టు?? అని హర్ష కాస్త కోపంగా అడిగేసరికి,
ఏం చెప్పాలో తెలియక బిక్క చచ్చిపోయింది హాసిని.
హర్ష ని చూస్తూ, ఈయనేనా!! అనుకుంది అంతే!!
తన నోటి మీద చేయి తీసేస్తూ,
ఎందుకు అంతలా అందులో దొంగ అని అరిచావ్ నన్ను చూడనట్టు, నా ఫేస్ తెలియనట్టు?? అని హర్ష కాస్త కోపంగా అడిగేసరికి,
ఏం చెప్పాలో తెలియక బిక్క చచ్చిపోయింది హాసిని.
హర్ష ని చూస్తే సూటిగా హాసిని నే చూస్తున్నాడు.
చెప్పు!! ఇంకోసారి కాస్త గట్టిగా అడిగాడు.
అది.. అది మిమ్మల్ని వెనుక నుండి చూసి గుర్తుపట్టలేదండి!!
మరి దొంగ అని ఎందుకు అరిచావ్??
మీరు అయితే ముందు నుండి వస్తారు కదండీ! దొంగలు అయితేనే ఇలా వెనుక నుండి వస్తారు కదా!! అని అప్పటికప్పుడు తోచిన అబద్దం చెప్పేయడం తో,
హాసిని చెప్పింది లాజిక్ నే కాబట్టి,
ఆమె వైపు చూస్తూ, డోర్ వరకు వెల్లాడు హర్ష.
మల్లీ వెనక్కొచ్చి,
చాలా ముద్దుగా ఉన్నావ్?? నడుం చూపించి పిల్లాడ్ని చెడకొట్టకు!! అసలే కార్యం నైట్, అంతవరకు వెయిట్ చేయాలి!! అని చెప్పి ఐ వింక్ చేసి వెల్లిపోయాడు హర్ష.
అతని మాటలు విని,
నోరెల్లబట్టి చూస్తూ ఉంది మన చిన్నూ.
హాసిని!!
చెప్పండి అత్తమ్మా!!
దీపం పెట్టేసావ్ కదా!! నెక్స్ట్ నువ్వే స్వీట్ చేసి మీ ఆయన కి తినిపించాలి!! అని హాసిని గుండెల్లో గ్రనైట్ పేల్చేసి వెల్లింది రుక్మిణి.
చచ్చాను రా బాబు!! అనుకుంటూ,
పక్కన ఏం జరిగుతుందో కూడా తెలియనంతగా నిద్రపోతున్న వైషు ని సాయి ని నిద్ర లేపింది.
అప్పటుకి ఇద్దరికి సగం నిద్ర తీరిపోవడం తో,
లేచి ఫ్రెష్ అయి, చుడిదార్ వేసుకుని బయటికి వెల్లారు.
ఇద్దరు కొంచెమ్ చలాకి పిల్లలు కావడం తో,
ఇంట్లో అందరితో కలిసిపోయారు.
హాసిని బయటికి వెల్లేలోపు హర్ష పక్కన చేరి జోరిగ లాగా చెవుల్లో ఊదేస్తున్నారు.
దాంతో హాసిని కి కోపమొచ్చి,
వైషు, సాయి అని గట్టిగా అరిచింది.
అందరూ హాసిని వైపు చూస్తూంటే,
వాల్ల చూపులకి కాస్త ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ,
అది పిన్నీ కాల్ చేసింది అమ్మమ్మా!! అందుకే పిలిచాను అని కవర్ చేసుకుని, వైషు సాయి వంక కాస్త కల్లురిమి చూసింది.
సాయి కి ఆ చూపులు అర్థం కాకపోయినా, వైషు అర్థమ్ చేసుకుంటూ, లాక్కెల్లిపోయింది సాయి ని.
ఇక్కడ ఫ్యామిలీ వాల్లకి,
హాసిని కి పొసెసివ్ అనుకుంటూ ఉంటే,
హాసిని అరుపు మాత్రం కొత్తగా వెల్లిన ఇంట్లో అంత చొరవ, పైగా డిస్టర్బెన్స్ చేసరని.
భ్రమర గారు, హాసిని చెంప తట్టి ఈ మాత్రం ఉండాలి లే!! లేదంటే నీ మొగుడిని కంట్రోల్ చేయలేవు అంటూ కిచెన్ లోకి వెల్లిపోయింది హాసిని ని కూడా తీసుకుని స్వీట్ చేయడం కోసం.
అప్పటికే టిఫిన్ తో పాటు భోజనాలు కూడా పూర్తవ్వడం తో,
హాసిని ని ఒక స్టవ్ కి ఓనర్ చేసేసి,
ఎంచక్క స్వీట్ చేయమని చెప్పింది రుక్మిణి.
అందరూ కిచెన్ నుండి బయటికొచ్చాక,
జై కోసం రైస్ కలుపుకుంటున్న కవిత ని కాస్త చిన్నగా వదిన!! అని పిలిచింది హాసిని.
ఏంటి హాసిని??
మీరు కూడా ఇలాగే స్వీట్ చేసారా?? అని కాస్త భయంగా అడిగింది.
ఫస్ట్ మీరు అన్నంత గౌరవం వద్దు నువు అనే పిలువు!!
అండ్ సెకండ్ ఆల్మోస్ట్ అందరు చేస్తారు హాసిని నాకు తెలిసి ఇలా!!
అవునా!! అంటూ
మరి మీరు అని అంతలో కవిత సీరియస్ గా చూడటం తో,
నువ్వు ఏం చేసావ్ వదినా అంది.
నేనా!! అదొక పెద్ద స్టోరీలే!!
షార్ట్ గా చెప్పు వదిన అనేసరికి,
కవిత కూడా షార్ట్ గా నే చెప్పి వెల్లిపోయింది.
చిన్న చిరునవ్వు చిన్ను పెదవుల మీద పూయగా,
ఇంతేనా!! అనుకుంటూ స్వీట్ చేసింది.
రుక్మిణి వచ్చి,
స్వీట్ అవుటర్ కోటింగ్ చూస్తూ,
హాసిని చూస్తేనే తెలుస్తోంది ఎంత అధ్బుతంగా వచ్చిందో అంటూ,
ఒక కప్ తీసి దేవుడి గదిలో పెట్టమని చెప్పింది.
హాసిని కూడా అలాగే చేసేసరికి,
ఒక కప్పు స్వీట్ తీసి, పైన హర్ష కి ఇష్టమైన కిస్మిస్ జీడిపప్పు తో గార్నిష్ చేసి హర్ష కివ్వమని చెప్పింది రుక్మిణి.
అంతే, ఇందాక చూసిన హర్ష రూపం తలుచుకుని కాస్త భయపడిపోయింది హాసిని.
అందరూ హాల్ లోనే ఉన్నారు.
హర్ష సోఫా లో కూర్చుని ఉంటే, అతని ముందుకు హాసిని ని తోసారు అత్తమ్మలిద్దరు.
తన ముందుకొచ్చిన హాసిని ని చూస్తూ,
స్వీట్ బౌల్ అందుకున్నాడు హర్ష.
హర్ష!! టేస్ట్ చేసి మీ ఆవిడ చేసిన స్వీట్ రుచి ఎలాగుందో చెప్పు?? అని అందరూ అడిగేసరికి,
ఒక స్పూన్ తీసుకొని నొట్లో పెట్టుకున్నాడు హర్ష.
హాసిని మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉంది.
అందరూ హర్ష ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తున్నాడు.
వైషు కి అది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి బిందాస్ గా కూర్చుంది ఉంది.
అందరి వైపు చూస్తూ,.ఇట్స్ గుడ్!! అని చెప్పేసి తన రూమ్ కి వెల్లిపోయాడు.
వెక్తున్న హర్ష వైపు అలాగే చూస్తూ ఉంది హాసిని.
రుక్మిణి!!
చెప్పండి అత్తమ్మా!!
భోజనాలు అయ్యాక రెండు గంటలకి మంచి సమయం ఉంది,
ఆ టైమ్ లో హర్ష ని హాసిని ని పంపించి,.మనం సాయంత్రం వెల్దాం!! అసలే రాత్రి కే కార్యం !! అని భ్రమర గారు చెప్పేసరికి,
హా!! అత్తమ్మ సరే అలాగే చేద్దాం అని మిగతా పనులు చూస్తూ ఉన్నారు రుక్మిణి.
జై కి అన్నం తినిపిస్తున్న కవిత పక్కకి వెల్లి కూర్చుంది హాసిని.
హాసిని, మా తమ్ముడు గుడ్ అన్నాడంటే నువ్వు స్వీట్ సూపర్ గా చేసుంటావ్ అని కవిత అనేసరికి ఇబ్బంది గా నవ్వింది హాసిని.
వదినా!! మీకు మ్యారేజ్ అయి ఎన్ని ఇయర్స్ అయింది??
ధైర్యం చేసి అడిగేసింది హాసిని.
ఫోర్ ఇయర్స్!!
మీరు ఏం చదువుకున్నారు??
ఎమ్.బి.ఎ!!
అంత చదువు చదివి జాబ్ చేయలేదా??
చేద్దామనే అనుకున్నా హాసిని,
కాని మంచి సంబంధం అని పెల్లి చేసేసారు.
ఇక పెళ్ల్ళయ్యాక అత్తయ్య మామయ్య, భర్త వాల్లని చూస్కోవడం అంతలోనే ఇదిగో పిల్లలు!! అంటూ జై నోట్లో నెయ్యన్నం పెడుతూ చెప్పింది హాసిని.
దానికి ఆలోచన లో పడింది హాసిని.
అసలు జాబ్ అనేది చెయ్యలనలుంటే పెళ్ళవకముందే వర్క్ అవుట్ అవ్వుదీ!! ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేయడానికి మనకి ఇంట్రస్ ఉండదు,
ఇన్ కేస్ ఇంట్రస్ట్ ఉన్నా, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవాలి !! అంటూ
అవును హాసిని అంతగా అడుగుతున్నావ్,
నీకు జాబ్ చేయాలని ఉందా?? అని అడిగింది కవిత.
దానికి హాసిని మౌనంగా!!
Continues….
🖋️ శ్రీ తార
Swipe left/right or tap the sides to turn pages