సమ్మోహనం – 4
అసలు జాబ్ అనేది చెయ్యలనలుంటే పెళ్ళవకముందే వర్క్ అవుట్ అవ్వుదీ!! ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేయడానికి మనకి ఇంట్రస్ ఉండదు,
ఇన్ కేస్ ఇంట్రస్ట్ ఉన్నా, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవాలి !! అంటూ
అవును హాసిని అంతగా అడుగుతున్నావ్,
నీకు జాబ్ చేయాలని ఉందా?? అని అడిగింది కవిత.
దానికి హాసిని మౌనంగా తల అటు ఇటు ఏటూ కాకుండా తిప్పింది.
జై అమ్మా!! వాటర్!! అని పిలిచేసరికి ఇంక హాసిని ని ఏమడగలేదు కవిత.
దిగులు గా ముఖం వేలాడదీసుకుని రూమ్ లోకి వెల్లిపోతున్న హాసిని ని పిలిచింది నీలిమా భోజనానికి.
డైనింగ్ టేబుల్ ఉన్నా, కొత్త దంపతులు కార్యం అయ్యే వరకు కలిసి ఒకే ఆకులో, కింద కూర్చుని తినాలని అందరికి కిందనే భోజనం ఏర్పాటు చేసారు రుక్మిణి.
హాసిని హెల్ప్ చేస్తా అన్నా కూడా వినకుండా, హర్ష ని కూడా రమ్మని ఇద్దరికి ఒకే ఆకులో వడ్డించారు అత్త, ఆడపడుచు కలిపి.
ఆకలి దంచుతూండటం తో,
మెల్లిగా నోరూరిస్తున్న జామూన్ ని నోట్లో పెట్టుకోబోయి,
భ్రమర గారు పిలవడం తో, జామూన్ మల్లీ బవుల్ లోకే చేరింది.
దంపతులు గా మొదటి భోజనమ్,
ముందు ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పింది.
హాసిని బెరుకుగా చూస్తూంటే,
హర్ష, మన అమ్మాయి కి అస్సలు ఇష్టం లేని బాదుషా నోట్లో పెట్టేసాడు.
అది తన కు ఇష్టం లేకపోయినా తప్పక మెల్లి మెల్లిగా నోట్లోది మొత్తం మింగేసింది హాసిని.
వావ్ అన్నయ్యా!! నువు సూపర్ అని పక్క నుండి వికాస్ అరవడం తో ఇంకాస్త్ తల ని దించేసిని హాసిని.
తర్వాత హాసిని కూడా ఒక స్వీట్ తినిపించడం తో,
అలా ఎక్స్చేంజ్ పాలసీ లో పెద్దల పర్యవేక్షణలో తింటూ ఉన్నారు
హర్షాసిని లు.
ఓయ్!! తన పక్కనున్న వికాస్ ని మెల్లిగా పిలిచింది వైషు.
అబ్బయి కాస్త పలకకపోవడం తో,
ఈ సారి తొడ గిల్లేసింది వైషు.
బాబు అరవబోయే టైమ్ కి, గిల్లిన ప్లేస్ లో చేయి వేసి నిమరడం తో,
మనసులో ఏదేదో అయిపోయింది వికాస్ కి.
ఎందుకు గిల్లావ్?
అని గొనిగినట్టు అడిగాడు వికాస్.
అందరిలో అలా బావురు కప్ప లా నోరేసుకుని వావ్ అని అరుస్తావేంటి, మా అక్క భయపడుతోంది అన్న సెన్స్ లేదా??
అందుకే గిల్లావా??
హా!!
ఇంకేం లేదా??
చిల్లు??
ఏంటి??
చిల్లు గారె ఉంది కావాలా??
వద్దు లే నువ్వే తిను!! అంటూ మొహం మాడ్చుకుని తన ప్లేట్ లో సాంబార్ అన్నం తింటున్నాడు వికాస్ బుద్ది గా!!
హర్ష హాసిని తినడం అయిపోవడం తో,
హ్యాండ్ వాష్ కి వెల్లారు.
సుముహూర్తం వచ్చేస్తుంది అనగా,
భ్రమర గారు ఇద్దరినీ తయారవ్వి రమ్మాన్నారు కన్యాదానం బట్టల్లోనే.
ఇద్దరూ వచ్చాక,
కవిత, హర్ష కి తోడు గా నువ్వెల్తావా?? అని అడిగింది నానమ్మ.
నానమ్మ వీడిని నేను ఒక్కదాన్ని పట్టుకోలేను, వాడిని ( వికాస్) నొ వెల్లమను అని తప్పించుకుంది.
వికాస్ బుక్కయ్యాక,
మేము సాయంత్రానికి వచ్చేస్తాం అని చెప్పి,
హర్ష ని హాసిని ని కార్ ఎక్కించారు.
హర్ష డ్రైవింగ్ కాగా,
పక్కన తన సతీమణి.
బ్యాక్ లో ఇరుగురు మరదల్ల మధ్యలో వికాస్.
వికాస్ ని చూసి వైషు మొహం తిప్పేస్తే, సాయి సిగ్గుపడుతూ వికాస్ కి దగ్గర దగ్గర గా జరుగుతోంది.
వారి దేవుడో!! అనుకుంటూ సాయి జరిగే కొద్ది,
వికాస్ వైషు మీద పడుతూంటే,
చూస్కుని కూర్చో, బాడీ టచ్ అయ్యిందో బుగ్గ బూరె అయితుంది.
వైషు మాటలకి వికాస్ గుడ్లు పెద్దవైతే,
మేము మగ పెళ్ళి వాల్లం, రెస్పెక్ట్ ఇవ్వవే పొగరు బోతూ అన్నాడు వికాస్.
అది రెండు రోజుల ముందు,
ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది,
సో రెస్పెక్ట్ గిస్పెక్ట్ జాంతా నై!!
అచా!!
హా??
అయినా వే అంటున్నావేంటి, హ?? నా పేరు వైష్ణవి.
పేరు తో పిలువు లేకుంటే మేడం అని పిలువు..
పిట్టంత ఉన్నావు, ఎంత పొగరే నీకు!!
అది నాకు బై బార్న్ నే ఉంది చి న బా…వా… సాగదీస్తూ అంది హాసిని.
బావా అన్నందుకు బటర్ ఫ్లైస్ ఫ్లయ్ అయినా,
మేడం అని పిలవమన్నందుకు హర్ట్ అయితే,
విక్కీ బావగారు?? నేను ఇవ్వనా నీకు రెస్పెక్ట్!!! అంది పక్కనుండి సాయి.
హే!! నీకు నా నిక్ నేం ఎవరు చెప్పారు?? కాస్త కోపంగా అడిగాడు వికాస్.
నీలిమా అత్తమ్మ!!
అమ్మా!!! నీకు ఎప్పుడూ తొందరే?? అనుకుంటూ, సాయి సిగ్గు కి వైషు పొగరు కి బలవౌతూ హాసిని ఇంటికి అయితే నలిగిపోయిన ఐరన్ షట్ లాగా వచ్చేసాడు.
హర్ష హాసిని కార్ దిగాక,
యాస్ ఇట్ ఈస్ హారతి పేర్లు చెప్పడం జరిగిపోతే,
పునీత్ బావ అయిన హర్ష ని ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చాడు.
హాసిని రూమ్ లో రెస్ట్ తీసుకోమనగా ఇద్దరినీ ఆ రూమ్ లోకి నెట్టేసారు పెద్దలు.
బయటే నిలబడి ఇంటిని చూస్తున్న వికాస్ కి
ఏం మీకు కూడా హార్తిచ్చి బొట్టు పెట్టాలా??
వ్యంగంగా అడిగింది వైషు.
ఒక్కడికే ఇస్తే ఏమ్ బాగుంటుంది,
పక్కకి నువ్వు కూడా రా, ఇద్దరం తీయించుకుని కుడికాలు పెట్టేద్దాం.
అంతకంటే వ్యంగంగా చెప్పాడు వికాస్.
అంత అదృష్టం మాకొద్దు లే అని మూతి తిప్పి ఎర్ర నీల్లు పారేయడానికి వైషు వెల్తే,
విక్కీ బావా, మనిద్దరం కలిసి హారతిప్పించుకుందామా అని వికాస్ పక్కన సెటిల్ అయ్యింది సాయి.
అంత అదృష్టం నాకొద్దు లే అంటూ లోపలికి వెల్లిపోయాడు వికాస్.
మెయిన్ అల్లుడ్ని లోపలికి పంపించి, వచ్చిన అల్లుడి తమ్మున్నికి మర్యాదలు చేసారు ముగ్గురత్తలు.
ఈ చిన్నల్లుడు మాత్రం ఇల్లు చూడటం లో బిజీ.
రెండు అంతస్తుల ఇల్లు అది.
మరి ఓల్డ్ కాదు గానీ ఓల్డ్ లాగే ఉంది.
కింద ఫ్లోర్ మొత్తం హాల్, కిచెన్ రెండు సైడ్ రూమ్ ఉండగా,
పైన మాత్రం చిన్న హాల్, పునీత్, హాసిని రూంస్ ఉన్నాయి, ఆ పైన ఖాళీ అన్నమాట టెరస్ లాగ!!
గేట్ దాటాక పూల చెట్ల తో ముద్దు గా ముచ్చటగా ఉంది ఆ ఇల్లు.
తమ హౌస్ మాత్రం ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు, ఇంటర్నల్ స్టెప్స్ తో మూడు ఫ్లోర్ల డూప్లెక్స్ హౌస్..
ఇక ఇంట్లో మనుషుల దగ్గరికి వస్తే,
ప్రమీల మారుతి హాసిని పేరెంట్స్..
పునీత్ ( బి.టెక్ సెకండ్ ఇయర్) హాసిని తమ్ముడు..
ఈ నలుగురు దే ఆ ప్రపంచం.
కాని మారుతీ మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరు ఆయన మాటే శాసనం ఆ ఇంట్లో.
ఇక చందు, పుష్ప ప్రమీల కి చెల్లెల్ల తో పాటు మారుతి కి మేనకోడల్లు.
సో కాస్త్ వాల్ల ఇంవాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంటుంది ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా!!
ఇక వేదా వైషు పుష్ప పిల్లలు,
సాయి శ్రీ, కుషల్ చందు పిల్లలు.
ఇంతే హాసిని ఫ్యామిలి.
ఒకసారి మనం హాసిని రూమ్ వరకు వెల్తే,
తన రూమ్ లోకి వెల్లడం తోనే కాస్త ఫ్రీ గా ఊపిరి పీల్చుకుంది
హాసిని.
ఆమె ముఖ భావాలు చూస్తూనే అక్కడే నిలబడ్డాడు హర్ష.
అంతలో హాసిని కి కడుపులో తిప్పుతున్నట్టు అనిపించి, నిలబడలేక పడిపోబోయింది,
ఆమె నే చూస్తున్న హర్ష హాసిని ని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి,
బయట నుండి ప్రమీల పిలవడం తో వెల్లాడు.
బాబూ జ్యూస్!!
థాంక్స్ అత్తమ్మా!!
మొహమాటంగా నవ్వి వెల్లిపోయింది ప్రమీల.
రెండు గ్లాసులు తనే తీసుకెల్లి,
హాసిని పక్కన కూర్చుంటూ ఆమె చేతికి ఒక గ్లాస్ అందించాడు.
అది లటుక్కున తీసుకుని, గుటుక్కున తాగేసి వాంటింగ్ సెంసేషన్ తో, నోటికి చేతిని అడ్డుపెట్టుకుంది హాసిని.
వీల్ల కాంవో కోసం ఎనీబడీ వెయిటింగ్??
ఎనీ గెస్ ఎబౌట్ హాసిని??
స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్..అసలు కామెంట్స్ నే రావడం లేదు..
Continues……
🖋️ శ్రీ తార
Swipe left/right or tap the sides to turn pages