కమల గారు అనుకున్నట్టుగానే పిల్లలందరికీ రకరకాల ఫుడ్స్ చేసి పెట్టారు. ఎవరికి నచ్చిన వాళ్ళు ఇష్టంగా తృప్తిగా తిన్నారు. కమల గారు చాలా సంతోషించారు అందరూ అక్కడే ఉన్నందుకు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నందుకు.
పిల్లలు ఐదుగురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అక్కడ ఉన్న పెద్ద వాళ్ళు ముగ్గురికి. ఎవరికి వాళ్లు మనసులోనే వీళ్ళకి దిష్టి తగలకూడదు అని అనుకున్నారు
ఇప్పటికే లేట్ అయింది కదా నువ్వు మెడిసిన్ వేసుకోవాలి అని అంటుంది త్రిషిక.
అవునమ్మా ఇప్పటికే లేట్ అయింది వెళ్లి మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకుందువు కదా అని అంటాడు దిలీప్.
సరే వదిన అయితే వెళ్ళొస్తామని కమల గారికి చెప్పి మాధురి గారు పిల్ల ముగ్గురితోటి వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు.
ఈరోజు కమల వదనం చాలా హ్యాపీగా ఉంది త్రిషిక.