ఉదయాన్నే రాఘవయ్య గారు ఇంట్లో కుటుంబ సభ్యులందరిని సమావేశపరుస్తారు.
ఏంటి నాన్నగారు ఎందుకు ఉదయాన్నే రమ్మన్నారు అని అడుగుతారు ప్రసాద్ గారు.
ఏమైంది మావయ్య ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతారు నరేంద్ర గారు.
దేవుడి దయవల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు లే అల్లుడుగారు. ఒకవేళ ఉన్న నా మనవడు వాటన్నిటిని కూకటివేళ్లతో సహా పీకి పక్కన వేస్తాడు అని అంటారు రాఘవయ్య గారు.
ఎందుకు నాన్న ఇంత ఉదయాన్నే మమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పారు అని అడుగుతారు రాధికా గారు. చెప్తానమ్మా చెప్పడానికే కదా మిమ్మల్ని అందరిని పిలిచింది అని అంటారు రాఘవయ్య గారు.
ఇంతకీ పిల్లలకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు.