ఒక్క క్షణం బాబు గుండెల మీద ఉన్న మచ్చ గుర్తుకు వచ్చి..విజయ్ కృష్ణ,జాను కళ్ళ ముందు మెదిలారు.. “నిజమే అమ్మానాన్న నన్ను నమ్మి చెల్లిని వదిలి వెళ్లారు.
నేను కూడా లేకపోతే అది పిచ్చిది అయిపోతుంది..” అని గుర్తుకు వచ్చిన మరుక్షణం వాళ్ళ అమ్మని ఒక్కసారి గట్టిగా హత్తుకొని ఆ మిషన్ నుంచి బయటకి వచ్చాడు.. అరక్షణంలో కాలిపోయే తన దేహాన్ని కాపాడుకుంటూ.
“నీకేమైనా పిచ్చారా..!” అని అన్నాడు ఏడుస్తూ చందు.
“ఇంత చదువుకొని,ఇంత అనుభవం ఉండి, జ్ఞానం ఉండి మీరు చేయాల్సిన పని కాదు ఇది అర్జున్ గారు..” అని అంది కోపంగా శుభ శ్రీ.
“మీ సిచువేషన్ నాకు అర్థం అవుతుంది.. కానీ..! ఇలా రియాక్ట్ అవ్వకూడదు మిస్టర్..” అని కొంచెం కటువుగానే అన్నాడు డిజిపి.