New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 91

నువ్వు  ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా పడుకుని రేపు రాత్రి కి జరగబోయే కార్యం గురించి  కలలు కను సరేనా అంటు కన్ను కొడతాడు భరత్..   అప్పటి వరకు ఏదేదో ఆలోచిస్తున్న ప్రణయ్  భరత్ లాస్ట్ లో మాట్లాడిన మాటకి, అతను చేసిన చిలిపి పనికి చిన్నగా నవ్వుతాడు..   ప్రణయ్ నవ్వడం చూసి  ఏయ్ ఏయ్ అదంత సిగ్గే అంటు కాసేపు ప్రణయ్ ని ఆట పట్టిస్తాడు భరత్ .. […]

3 min 49 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 92

కష్టం లేదు ఏమీ లేదు నువ్వు నాకు ఎప్పుడు చిన్నపిల్లవే అనుకో మా.. అయినా మా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు కదా ఇప్పటివరకు పడ్డ కష్టం చాల్లే..   ఇప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకో.. ఏమైంది నేను ఉన్నాను కదా నాకు వచ్చినంత వరకు నేను చేసుకుంటానులే అంటు తల్లిని  వారిస్తూ తనే నీళ్లు అన్ని మోస్తూ ఉంటాడు ప్రణయ్..   అబ్బా ఒక్కడివే ఎంతసేపు అని తెస్తావు నాన్న నేను కూడా సాయం చేస్తాను […]

3 min 52 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 93

భాను నోట్లో నుండి ఆ మాటలు వినగానే భరత్ కి రాత్రి ప్రణయ్ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తు వస్తాయి.. వాట్ అంటే ప్రణయ్ ఊహించింది నిజమా ప్రతిమాకు ఈ పెళ్లి నిజంగానే ఇష్టం లేదా..   అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్లిపోయిందా ఏంటి అంటూ అనుమానంగా రకరకాలుగా ఆలోచిస్తుంటాడు అతని మనసులో..   మళ్లీ వెంటనే  ఊహు నేను అలా ఆలోచించడం  కూడా తప్పే.. ముందు అసలు ప్రతిమ ఎక్కడ ఉందో ఎక్కడికి […]

4 min 53 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 94

హ్మ్ ఏదేమైనా ప్రతిమ చాలా మంచిది అని అర్ధం అవుతుంది.. ఈ ఇంటికి తగ్గ కోడలే వచ్చింది అని భరత్, భాను సంతోష పడతారు..   భరత్ బాబు ఇదిగోండి టీ మీరు తాగేసి వీటిని తీసుకెళ్లి బయట ఉన్న వాళ్ళకి ఇచ్చేసి రండి  అని చెప్తారు యశోద గారు..     హ్మ్ అలాగే అత్తయ్య అంటూ యశోద గారి ప్లేట్లో నుంచి ఒక గ్లాస్ తీసుకొని అక్కడే కూర్చుని టీ తాగుతూ ఉన్న భరత్  […]

4 min 51 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 95

కూతురు మాట్లాడిన మాటలకి ముందు షాక్ అయిన భరత్ వెంటనే నవ్వుతూ  ఏమైంది బంగారు తల్లి పొద్దు పొద్దున్నే అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావు..   ఏం చేసింది అమ్మ నిన్ను.. ఎందుకు ఈ బంగారు తల్లికి అమ్మ మీద అంత కోపం వచ్చింది.. ఎందుకు ఈ అమ్మ వద్దని ఇంకో అమ్మని తెచ్చుకుందాం  అంటున్నావు..   ఏ నీకు  ఈ అమ్మ నచ్చలేదా బంగారం అని తన తలని స్వీటీ చిన్ని బొజ్జ మీద చిన్నగా […]

3 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 96

అది గమనించిన భరత్ భాను చేయి పట్టుకుని ఆపేలోపే ఆమె ముందుకు వెళ్లిపోవడంతో అబ్బా ఈ భానుకి కోపం వచ్చినట్టుందిగా, అనవసరంగా బంగారు తల్లి పొద్దుపొద్దున్నే  ఈ తిక్క దానికి తిక్క రేపింది..   ఇప్పుడు నేను ఈ చిట్టి తల్లి తరఫున ఏం మాట్లాడినా  అంతా నేనే చేసినట్టు నామీద  గయ్యిమని అరుస్తుంది.. సో ఇప్పుడు నేను కాసేపు మౌనంగా ఉండడమే అందరికీ మంచిది..   లేదంటే  చిన్నపిల్ల చిలిపి గొడవ కాస్త చిలికి చిలికి […]

3 min 48 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 97

స్వీటీ అడిగిన ప్రశ్నలకి తన వెన్ను మీద చిన్నగా నిమురుతూ అవును కదా బంగారం నువ్వు మాట్లాడింది చాలా తప్పు కదా..   అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా.. తను మిమ్మల్ని కోప్పడుతుంది అంటే తనకి మీ మీద ప్రేమ లేదు అని కాదు.. మీరు సరిగా అన్నం తినకపోతే ఎక్కడ మీ ఆరోగ్యం పాడైపోతుందో అన్న భయం..   మిమ్మల్ని ఆడుకోవడానికి బయటకి పంపించడం లేదు అంటే  పెద్దవాళ్ళు ఎవరూ లేనప్పుడు మీరు బయటకు వెళ్తే మీకు ఎక్కడ […]

4 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 98

ముద్దుగా ఉన్న స్వీటీ నే చూస్తూ అనుకోకుండా తల పక్కకి తిప్పిన ప్రతిమకి తన వైపే చూస్తున్న ప్రణయ్ కనిపిస్తాడు..   ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి.. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండగా  మావయ్య నిన్నే తను నన్ను గిచ్చింది మావయ్య నువ్వు తనని ఏదో ఒకటి చెయ్యి అని బుంగమూతి పెట్టి మరి చెప్తుంది  స్వీటీ ..   పాప మాటలకి ప్రతిమా ప్రణయ్ ఇద్దరు చూపులు పక్కకు తిప్పేసుకుంటారు.. స్వీటీకి […]

3 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 99

ప్రతిమ తనతో ఎలా ఉన్నా సరే, ఇంట్లో వాళ్లతో మాత్రం బాగానే ఉంటుందని ఈ కాసేపట్లోనే అర్థమైన ప్రణయ్ ఇప్పటికి ఇదే సంతోషం అనుకుంటాడు..   ప్రణయ్  ఒక వైపే చూస్తూ ఉండడం గమనించిన స్వీటీ ఏంటి మావయ్య అలానే చూస్తూ ఉన్నావు ఏముంది అక్కడ  అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది..   స్వీటీ మాటలకి కొడుకు వైపు చూసినా యశోద గారికి కొడుకు తన గది వైపే చూడడం గమనించి  ప్రతిమ కోసం అలా చూస్తున్నాడని […]

3 min 47 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 100

ఆవిడ మాటలకు ప్రతిమ చిన్నగా నవ్వుతూ  నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అత్తయ్య.. అమ్మలా చూసుకునే మీరు నా పక్కనే ఉన్నప్పుడు నాకు ఇంకెందుకు బెంగగా ఉంటుంది..   రాత్రి ఎందుకో అమ్మానాన్న గుర్తొచ్చి అలా అనిపించింది కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు.. మీరు నాతో ఒక తల్లిలానే ఉన్నారు కాబట్టి.. మీరు పక్కనే ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్తుంది..   హ్మ్ మంచిది బంగారం.. నువ్వు నాలో మీ […]

4 min 107 views