New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 6

సంతోషం గా ఇంటికి వెళ్లిన శేఖర్ గారు పొలానికి వెళ్ళిపోగా , శాంతి ఇంట్లో పనుల్లో నిమగ్నం అవుతారు…   ప్రతిమ సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రాగానే   పెందలాడే స్నానం చేసేసి  ఈరోజు బాగా అలసిపోయాను అమ్మ అంటు త్వరగా తినేసి తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది..   కూతురు తో పెళ్ళి గురించి మాట్లాడాలి అనుకున్న శాంతి  ప్రతిమ అలసిపోయాను అని చెప్పడం తో అప్పటికి ఆ విషయాన్నీ వదిలేస్తారు…   ఆ రాత్రి […]

4 min 109 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 7

భర్త మాటలు విన్న శాంతికి కూడా ఆయన మాటల్లో నిజం ఉందని అనిపించి హ్మ్ నిజమే అండి  మీరు చెప్తుంది కూడా వాస్తవమే..   యశోద వదినకి మన కుటుంబం మీద ప్రతిమ మీద ఎంత ప్రేమాభిమానాలు వున్న  మనం ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే తన మనసు కూడా  మారే అవకాశం వుంది..    ఎవరు మాత్రం  కోరి వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకుంటారు చెప్పండి.. మీరు అన్నట్టుగా మన ప్రతిమ ఎలానూ మన మాట జవ […]

4 min 77 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 8

వాళ్ళది మన వూరే.. వాళ్ళది కూడా మనలానే వ్యవసాయ కుటుంబం.. వాళ్ళు నీకు చాలా బాగా తెలిసిన వాళ్లే సుమీ అంటు నవ్వుతు చెప్తారు యశోద. .   ఏంటి మన ఊరి సంబంధమా.. మన ఇంటికి వచ్చి మరి సంబంధం అడిగారా… ఎవరమ్మా వాళ్ళు అని ఆరాగా విషయం అడగగా యశోద శేఖర్, శాంతిలు వచ్చిన దగ్గర నుండి వెళ్లిన వరకు  పూస గుచ్చినట్టు మొత్తం చెప్తారు..   అంతే ఆ మాటలు విన్న ప్రణయ్ […]

4 min 80 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 9

హ్మ్ ఇంక మాట్లాడేది ఏమి లేదులే కానీ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయి ఈలోపు నేను అక్కకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాను అంటారు యశోద..    హ సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుండి  బయటకి వెళ్ళిపోతాడు ప్రణయ్..   కొడుకు వెంటే బయటకి వచ్చిన యశోద హాల్లో వున్న చిన్న సోఫా లో కూర్చుని తన ఫోన్ తో కూతురు భాను కీ కాల్ చేస్తుంది..   రింగ్ అయి […]

4 min 71 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 10

పొలానికి వెళ్లిన  ప్రణయ్  పొలం గట్టు మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోతాడు..   ఏంటి ఇదంతా ఉన్నట్టుండి  అమ్మ, మావయ్య ఇద్దరు కలిసి  నా పెళ్ళి ఖాయం చేసేసారు..   నేను ఇంతవరకు  ఆ అమ్మాయి నీ కూడా చూడలేదు.. అప్పుడెప్పుడో టీనేజ్ లో వున్నప్పుడు ఒకటి, రెండు సార్లు  చూసినట్టు గుర్తు…   ఈ మధ్య కాలం లో అయితే చూసింది లేదు.. నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా నన్ను అసలు చూసి ఉండదు.. […]

3 min 74 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 11

భాను మొహం చూసి  హహహ అల్లుడు గారు ఏదో సరదాగా అంటున్నారులే భాను తల్లి.. ఆయన అల్లరి మాటలకి నువ్వు ఎందుకు మొహాన్ని అలా పెట్టుకుంటావ్..   ముందు ఇలా వచ్చి కూర్చొని ఈ సున్నుండలు తిను  అంటు కూతుర్ని అల్లుడి పక్కన కూర్చోపెట్టి ప్లేట్ చేతికి ఇస్తారు యశోద..   అత్తగారి మాటలకి , భార్య బిత్తర చూపులకి అందం గా నవ్వేస్తూ ఇప్పుడు నేను నిన్ను, నీ తమ్ముడిని ఏమి అనడం లేదులే కూర్చొని […]

3 min 66 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 12

హ్మ్ ఏంటి మీరు ఇక్కడకి వచ్చినప్పటి నుండి మా తమ్ముడి మీద పడ్డారు అని చిరు కోపం గా అడిగింది భాను..   అయ్యో రామ ఇది మరి బాగుంది గా. నేను ఇక్కడెక్కడో నా మానాన నేను నిల్చుని ఉంటే మీ తమ్ముడి మీద పడ్డాను అంటావ్ ఏంటి  భాను..   నిజం చెప్పాలి అంటే నువ్వు, మీ తమ్ముడే తుమ్మ బంక లా అతుక్కుని వున్నారు.. మీ మధ్యలో మాకు ఎక్కడ చోటిస్తున్నారు మేము […]

3 min 64 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 13

దెబ్బకి ఉలిక్కిపడ్డట్టుగా అతనికి దూరం జరిగి ఇదిగో ఈ వేశాలే కాస్త తగ్గించమని చెప్పేది.. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారని ఎవరికి ఎం నేర్పిద్దామని ఇలా చేస్తున్నారు..   మీరు వేసే వేషాలకి మా తమ్ముడ్ని అడ్డం పెట్టుకుంటున్నారా హా.. ఇదేమైనా   మన ఇంట్లో మన పర్సనల్ బెడ్ రూమ్ అనుకుంటున్నారా..   అమ్మ వాళ్ళ ఇంట్లో హాల్లో నిలబెట్టి ఎం చిలిపి పనులు ఇవి అంటు కోపం నటిస్తుంది భాను..   ఆమె కోపం గా చూసిన […]

4 min 58 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 14

    వైజాగ్ చేరుకున్న ప్రతిమ పిల్లలతో, తన తోటి టీచర్స్ తో కలిసి అరకు ఏరియా మొత్తం చుట్టేస్తూ వుంటుంది ..   ఎక్కడ ఆమెకి అందమైన ప్రదేశం అని అనిపిస్తుందో అక్కడ నిలబడి ఎన్నో ఫొటోస్, వీడియోస్ తీసుకుంటుంది..   అవన్నీ తన ఫోన్ లో చూసుకుంటూ రేపటి రోజున నాకు పెళ్ళి అయిన తరువాత నా హస్బెండ్ తో కలిసి వీకెండ్స్ లో ఇలా ఔటింగ్స్ కి ప్లాన్చే సుకోవాలి..   నార్మల్ […]

3 min 62 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 15

తను అలా ఆలోచనల్లో మునిగి ఉండగా అక్కడకి పిల్లలు వచ్చి మేడం అటు సైడ్ ప్లేస్ చాలా బాగుంది.. బట్ ఇక్కడ నుండి సరిగా కనపడడం లేదు..   మనం ఆ ప్లేస్ దగ్గరకి వెళ్లి చూసేసి వద్దాం ప్లీజ్ మేడం అని పిలవడం తో పిల్లలు అంత క్యూట్ గా ఫేస్ పెట్టి అడగడం తో పిల్లలు అంటే ముందునుండే ఇష్టం అయిన ప్రతిమ వాళ్ళ కోరిక ని కాదనలేక తన ఆలోచనల్ని అంతటితో ఆపేసి […]

3 min 66 views