ఉదయం ఎప్పటిలాగే భట్టర్‌తో కలిసి టిఫిన్ తయారు చేసిన సాక్షి, అందరికీ కాఫీ ఇవ్వడానికి వెళ్లింది. తారక్ నుంచి ఆమె మళ్లీ ఆఫీస్‌కి వెళ్లబోతున్న విషయం తెలుసుకున్న చంద్రప్రసాద్ యాదవ్ గారు, సాక్షిని తన దగ్గరకు పిలిచారు.
“ఐ యామ్ వెరీ హ్యాపీ సాక్షి .. నీ డిసిషన్ గురించి. ఎందుకంటే నువ్వు నా స్టూడెంట్‌వి. నీ టాలెంట్ గురించి నాకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలిసే అవకాశం ఉంది చెప్పు?