పార్టీ ముగిసిన తర్వాత ఆయుష్ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని తన చేతుల్లో ఎత్తుకున్న తారక్, సాక్షితో కలిసి అయోధ్య వైపు బయలుదేరాడు.
పెద్ద కాంపౌండ్ దాటి కారు ఇంటి ముందు ఆగగానే, తారక్ సాక్షి చేయి పట్టుకుని, ఆయుష్‌ను భుజంపై వేసుకుని ఇంటి ముందు వచ్చాడు.
అప్పటికే కౌసల్యగారు హారతి పళ్లెం పట్టుకుని వారి దగ్గరకు వచ్చారు.
“ఓహో… పడుకుండిపోయాడా మన రాజకుమారుడు?” అంటూ కౌసల్యగారు వారిద్దరికీ హారతి ఇచ్చి దిష్టి తీశారు.
“చూడు… బిడ్డకు ఎంత దిష్టి తగిలిందో!”
“సాక్షీ, బిడ్డతో నేను పడుకుంటాను. మీ ఇద్దరికీ కూడా అలసటగా ఉండొచ్చు. మీరు ఇద్దరూ బాగా నిద్రపోండి.”
“సాక్షీ, రా… పాలు కాచి పెట్టాను ఇస్తాను… నువ్వూ తారక్ ఇద్దరూ తాగి పడుకోండి,” అని చెప్పిన షాలిని, ఆయుష్‌ను ఎత్తుకుని వెళ్లింది. అందరూ తమ తమ గదుల్లో పడుకోవడానికి వెళ్లారు.
“తారక్ సార్, మీరు రూమ్‌కి వెళ్లండి. నేను పాలను వేడి చేసుకుని తీసుకొస్తాను,” అని చెప్పి, చీర కొంగును నడుముకు దోపుకుని వంటగదిలోకి వెళ్లింది.
ఆమె వెనుకే వెళ్లిన తారక్, ఆమె స్టవ్‌పై పాలు పెట్టగానే వెనుక నుంచి ఆమెను కౌగిలించుకున్నాడు.
“ఏంటి… ఈరోజు మన ఫస్ట్ నైట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నావా? పాలు వేడి చేసుకుని తీసుకొస్తున్నావు?” అని అన్నవాడు, మెల్లగా ఆమె పొట్టపై చేయి వేశాడు.
“అయ్యో… మీకు ఎప్పుడూ దాని గురించే ధ్యాస. మన ఫస్ట్ నైట్ రోజేనా? రోజూ పాలు తీసుకొస్తాను కదా! ఈరోజు ఏం స్పెషల్ లేదు. వెళ్లండి వెళ్లండి… రూమ్‌కి,” అని చెప్పిన సాక్షి నవ్వుతూ రెండు గ్లాసుల్లో పాలు పోసింది.