మీ ఫ్రెండ్ దగ్గర జాబ్ చేస్తున్నప్పుడే పిలవని నేను ఇప్పుడేలా పిలుస్తాను.. అయినా మీరు శ్రీరామ్ సర్ వాళ్ళింట్లో అంటే సర్ ముందే తెలుసా మీకు అని ఆశ్చర్యంగా అడిగింది స్వర్ణ..
హ్మ్! వాడు ఇంద్ర కి కాలేజ్ ఫ్రెండ్ నాకు బిజినెస్ ఫ్రెండ్ అనగానే… ఇ ఇంద్ర వచ్చాడా?? అని కొంచెం భయంగా అడిగింది…
హ్మ్! క్లయింట్స్ తో మీటింగ్ ఉందని వచ్చాడు కానీ నువ్వెందుకురా ఇల్లు వదిలి వచ్చావ్ అని అడిగాడు సన్నీ…
ఓహ్! మీకు చెప్పేసాడా?? అని బాధగా అడిగింది..