ఆ రాత్రి మొదలయింది❤️🔥5
ఇప్పుడు అర్థమైంది, పిక్చర్ పర్ఫెక్ట్.
ఫుల్ క్లారిటీతో, పాప గుండె ఆగిపోయినట్టే అయింది.
కనుపాప కదపకుండా, అలాగే అతని చూస్తూ ఉండిపోయింది.
పాపా ఆలోచనలన్నీ
ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి.
బాడీ చల్లబడిపోయింది.
తననే గుడ్లు పొడిచి చూస్తున్న
పాప పరిస్థితి అర్థం అవుతుంటే
ఆమెను అంతలా షాక్ కు గురిచేసిన సాటిస్ఫాక్షన్ తో
ఒక కన్నింగ్ స్మైల్ అతని పెదవుల మీద.
పాప బుగ్గలని మరి కాస్త గట్టిగా నొక్కి పెట్టాడు.
కొద్దిగా తెరుచుకున్న పెదవుల మధ్య నుంచి
నోటిలోకి చిన్నగా గాలి ఊదుతున్నాడు.
అతను ఊదుతున్న గాలి
ఆమె గొంతులోకి చేరుతుంది.
ఉక్కబట్టి, ఊపిరి బిగించి ఉండడంతో
ఆ గాలికి గొంతులో తడి ఆరిపోయి
కొరబోతు ఒక్కసారిగా కసకస దగ్గుతుంది.
వెంటనే ఆమెను వదిలేసి నవ్వుతూ చూస్తున్నాడు.
భలే ఫన్నీగా ఉంది అతనికి మాత్రం.
చెయ్యి అడ్డు పెట్టుకొని కసకస దగ్గుతున్న ఆమెకి
ఊపిరి అందక ఇబ్బంది అవుతుంటే
గుండెల మీద చెయ్యి పెట్టుకొని
నెమ్మదిగా రుద్దుకుంటూ..
అతను చెసిన పనికి కసిగా చూస్తుంది.
గొంతులో మంట పుడుతూ..
అప్పటికి చిన్నగా దగ్గు వస్తూనే ఉంది.
బు.. బుద్ధి ఉందా, ఏ ఏం చేసావు నువ్వు..??
మంట పుడుతున్న గొంతుతో, కచ్చిగా అరిచేస్తుంది.
అతను అలాగే ఫన్నీగా చూస్తూ..
నేను అడిగిన దానికి నీ ఊపిరి ఆగిపోతే
నా ఊపిరి అందించి ప్రాణం పోసాను.
దిస్ ఇస్ దా బేసిక్ రూల్.
ఎవరికన్నా ఊపిరి అందనప్పుడు
వెంటనే వాళ్ళకి బ్రీత్ ఇవ్వాలి.
నీకు తెలియదా పాప..??
అంటూ వెటకారంగా కళ్లు ఎగరేస్తాడు.
గుడ్లు పీకేస్తాను,
ఇంకోసారి నా దగ్గర ఇట్లా చేసావంటే.
అసలు ఏమనుకుంటున్నావు నన్ను చూసి హా..
ఊపిరి ఆగి పోయేలా నోటికొచ్చింది వాగేసి,
నీకు తోచినట్టు పిచ్చిగా చేసి..
మళ్లీ ఏదో సమాజ సేవ చేసినట్టు నవ్వుతున్నావా??
అసలు నన్ను ఏం అడిగావో అర్థం అవుతుందా??
అసలు ని కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను..??
నీ కళ్ళకి చెత్వారం వచ్చిందా..
లేక నన్ను చూస్తే అలా అనిపిస్తుందా..??
అని కచ్చ పిచ్చ తిట్టేస్తుంది.
కదిలే ఓపిక లేదు కానీ
లేకుంటే మీద పడి పిచ్చి దానిలా రక్కిపెట్టేది.
అంత కోపంగా ఉంది పాపకి.
నడి రోడ్డు మీద ఇలా అర్ధరాత్రి పూట
ఒంటరిగా కనిపించేసరికి,
తనని తప్పుగా చూస్తున్నాడేమో నన్న
ఆలోచనతో మరింత కోపంగా అనిపిస్తుంది పాపకి.
అసలు మగాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారా??
ఇలాగే ఆడపిల్లల్ని చూస్తారా..??
అంటూ ఆవేశ పడుతుంది.
చేతుల్ని గాలిలో తిప్పుతూ
మాటా మాటాకి అతని మీద మీదకి
పొడిచినట్టే తీసుకువెళ్తుంది.
మీద మీదకు వస్తున్న పాప చేతులు
తనకి తగలకుండా తల అటు ఇటు కదుపుతూ
వెనక్కి తప్పుకుంటున్నాడు.
పాప అరుపులకి ఇంక చిరాకు వచ్చి
హేయ్… స్టాప్ ఇట్. అని షౌట్ చేస్తూ
తన మీదకు వచ్చిన పాప చేతిని పట్టుకుంటాడు.
అరిచిన దానికన్నా, చెయ్యి పట్టుకున్న దానికి
ఇంకా కోపం పెరిగిపోతుంటే..
రేయ్.. రేయ్.. వదల రా
వదులు నా చేతిని ముందు.
అవకాశం దొరికింది కదా, అని
ఆడపిల్ల దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటావా
నన్ను ముట్టుకుంటావా.
ఒరేయ్ బేవర్స్.. వదులు.
అని పిచ్చా కోపంతో అతని మీద అరుస్తూ
చెయ్యి వదలమంటు మరొక చేత్తో అతని
భుజం మీద కొట్టేస్తూ, తన చేతిని గట్టిగా వెనక్కి
లాక్కుంటుంది.
పాపా అరుపులకి, ఆమె గోలకి
ఒక మినీ మూవీ చూస్తున్నట్టు
కామ్ గా చూస్తున్నాడు.
తను నోరు పెంచి మాట్లాడే సరికి
అతను కామ్ అయిపోయాడు అనుకుని
వీడిని ఇలాగే కంట్రోల్ చేసి మనం
ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి.
వీడు పెద్ద రేపిస్ట్,
లేదంటే అమ్మాయిల పిచ్చోడిలా ఉన్నాడు.
అని మనసులోనే ఒక రిల్ వేసుకొని..
కప్పుకున్న చీర కొంగుని దులిపి
నడుం చుట్టూ తిప్పి తీసుకొచ్చి బొడ్డులో దోపుకుంది.
తనకి అసలు భయం లేదు.
చాలా ధైర్యవంతురాలని అన్నట్టు బిల్డప్ ఇస్తూ..
ఏరా భయం వెసిందా?
ఇందాక లోడ లోడ ఏదో వాగేవు.
ఇప్పుడు… ఇప్పుడు వాగారా
ఇప్పుడు వాగు.. అని దబయిస్తుంది.
చూడడానికి బక్కగా ఉంది,
బాగుంది, పట్టుకు పోదాం అనుకున్నావా?
నన్ను ముట్టుకుంటే..
ముట్టుకుంటే షాక్ కొడుతుంది.
సూటు బూటు వేసుకొని బానే ఉన్నావుగా,
నీకు ఇదే బుద్ధి రా..??
నన్ను అలా అడుగుతావా..
ఎంత ధైర్యం ఉంటే అడుగుతావు..??
అతడికి చూపుడువేలు వేలు చూపించి
రెచ్చిపోతూ తన కోపనంత కక్కెస్తుంది.
పాప పిచ్చిగా అలా అరుస్తూనే ఉంది.
పాపని చూస్తూ అతను లేచి నిలబడ్డాడు.
ఒంటి మీద ఉన్న బ్లేజర్ కోట్ ఊడదీసి
బెంచ్ మీద పడేసాడు.
చారుమతి అస్సలు పట్టించుకోవడం లేదు.
తిక్క రేగిన పిల్లి పిల్లిలా గరం గరం గా ఉంది.
అటు ఇటు ఊగుతూ వే
లు చూపించి మాట్లాడుతున్న చారుమతి ని
పెదవి వంకరగా సాగదీసి,
ఒక కన్నింగ్ లుక్ తో చూస్తూ..
ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు.
కళ్ళు మూసుకున్న అతనికి..
పాప గొంతు వినబడుతుంది.
పాప బాడీ షేప్ చక్కగా కనిపిస్తుంది.
ఉమ్.. గుడ్ బాగుంది.
గొంతులో అరుపు పెద్దది.
గుండెలో ధైర్యం చిన్నది.
ఈ కోడి బ్రెయిన్ ఫిక్స్.
బాగా ఓవర్ చేస్తుంది,
ఈ మందమతికి ఒక డోస్ పడాల్సిందే.
అని డెసిషన్ తీసుకొని కళ్ళు తెరుస్తాడు.
***************************************
మళ్లీ కలుద్దాం…
ట్యాగ్ యువర్ కామెంట్స్.
సపోర్ట్ మీ విత్ యువర్ రేటింగ్స్.
ఫాలో మీ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.
థాంక్యూ.
మీ వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages