ఎపిసోడ్ 19
స్వప్నిక బాత్రూమ్ లోకి దూరగానే వెంటనే ఎవరికో ఫోన్ చేసాడు విజె.
స్నానం చేసిన స్వప్నిక బయటకొచ్చింది. తలుపు వేసిన శబ్దానికి తలెత్తి చూసిన విజె కళ్ళు ఒక్కసారి ఆమెపై అతుక్కుపోయాయి.
తలస్నానం చేసిన స్వప్నిక పింక్ కలర్ బాత్ డ్రెస్ లో తెల్లగా మెరిసిపోతూ కనిపించింది.
“హేయ్, సూపర్ ఫిగర్. ఎంతోమందిని బాత్ డ్రెస్ లో చూసాను కాని, ఇంతందంగా ఎవ్వరూ కనిపించలేదు తెలుసా?” అని ఆశ్చర్యంగా అన్నడు విజె.
అంతె కస్సుమన్నట్టు తలెత్తి చూసింది.
“అవునా, చూస్తేనే తెలుస్తుంది.ఎంతమంది అమ్మాయిల్ని నీ పక్కలోకి తెచ్చుకున్నావో? ఇంతకీ నా నెంబర్ ఎంతా?” అని సీరియస్ గా అడిగింది స్వప్నిక.