ఎపిసోడ్ 7
వీజే ముఖంలో మారుతున్న రంగులను చూసిన మహికి ఏమి అర్థం కాలేదు.
“అరేయ్, ఇది ఇండియా రా, ఇక్కడ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. మొదలే నువ్వు చాలా ఫాస్ట్.” అని అన్నాడు మహి.
అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరారు.
ఇంటికి వచ్చిన స్వప్నిక చాలా కోపంగా ఉంది. ఏడుస్తూ రచ్చ చేయడానికి ఆమె అందరి లాంటి అమ్మాయి కాదు. స్వప్నిక భయంకరమైన పరిస్థితులను కూడా జాగ్రత్తగా డీల్ చేస్తుంది.
ఎప్పుడు తన మనసును, ఆలోచనలను కోపాన్ని అదుపులో ఉంచుకుంటుంది. చాలా డిగ్నిటీగా, డీసెన్సీగా ఆలోచిస్తుంది. తన బ్యాగ్ ని అక్కడ సోఫాలో విసిరేసి తన బెడ్ రూం లోకి వెళ్ళి తలుపులు మూసుకుంది.