పరవశం – 4
మెట్ల దగ్గరికి వచ్చిన విక్రమ్ హాల్ లో ఉన్న వ్యక్తులని చూడగానే చాలా అంటే చాలా కోపం వచ్చింది..
కోపంగా “నానమ్మా!” అని గట్టిగా పిలుస్తాడు..
అప్పటివరకు ఆ వ్యక్తులతో మాట్లాడుతున్న విక్రమ్ నానమ్మ జయ గారు, విక్రమ్ అరుపుకి అతని వైపు చూస్తారు..
“విక్కీ! ఎంతసేపు అయ్యింది నువ్వు వచ్చి?” అని అడుగుతారు.. నవ్వుతూ విక్రమ్ వైపు చూసి..
“నేను వచ్చి చాలా సేపు అయ్యింది… ముందు నాకు విషయం చెప్పు, ఎవరు వీళ్ళంతా?” అని అడుగుతాడు అనుమానంగా.. ఎందుకంటే అతడికి వాళ్ళు ఎవరు అనేది తెలుసు..
ఎందుకు వచ్చారు అన్నది కూడా తెలుసు.. కానీ వాళ్ళ నానమ్మ నోటి నుంచి వినాలి అనేది అతడి కోరిక, అందుకే ఆవిడ వైపు చూసి చాలా అంటే చాలా సౌమ్యంగా అడిగాడు..
ఆవిడ విక్రమ్ వైపు చూసి నవ్వుతూ, “అక్కడే ఉండి మాట్లాడతావా.. ఇక్కడికి వచ్చేదేమైనా ఉందా?” అని అడుగుతారు ఆవిడ..
ఆ మాటకి విక్రమ్ ఆవిడ వైపు సూటిగా చూస్తూ మౌనంగా కిందకి వచ్చి వాళ్ళ నానమ్మ వైపు చూస్తాడు..
ఆవిడ నవ్వుతూ విక్రమ్ చెయ్యి పట్టుకుని వాళ్ళ వైపు తిరిగి, “నా మనవడు విక్రమ్.. విక్రమ్ రాథోడ్,” అని అంటారు.. నవ్వుతూ వాళ్ళ వైపు చూసి..
వాళ్ళు కూడా నవ్వుతూ విక్రమ్ వైపు చూసి, “అయ్యో! మీ మనవడి గురించి మాకు ఎందుకు తెలియదు.. ఇండియా టాప్ మోడల్ డిజైనర్లలో ఒకరు.. అలాగే ఆ మోడల్ డిజైనింగ్ కంపెనీ కూడా నంబర్ వన్! రీసెంట్ గా కూడా విన్నాం.. తన ఫాదర్ కంపెనీ కూడా టేకోవర్ చేశాడు అని..
కానీ బయట ఎక్కడా చూడలేదు.. ఇప్పుడే చూస్తున్నాం,” అని అంటారు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒక 45 ఇయర్స్ ఉన్న అతను..
ఆ మాటకి జయ గారికి చాలా గర్వంగా అనిపించింది.. తన మనవడి గురించి వాళ్ళు అలా అంటుంటే.. వాళ్ళ వైపు చిన్నగా నవ్వుతూ చూశారు…
ఆవిడ మళ్ళీ విక్రమ్ వైపు చూసి, “విక్కీ, వీళ్ళు నా ఫ్రెండ్ గాయత్రి, నీకు తెలుసు కదా! వాళ్ళ కూతురు శాంతి, అల్లుడు సుధాకర్, వాళ్ళ కూతురు నైనిక,” అని వాళ్ళని పరిచయం చేస్తారు..
ఆ మాటకి విక్రమ్ వాళ్ళ వైపు చూసి, “నమస్కారం,” అంటూ రెండు చేతులు జోడిస్తాడు..
వాళ్ళు కూడా చిన్న చిరునవ్వు నవ్వుతారు.. నైనిక మాత్రం “హాయ్ విక్రమ్!” అంటూ తన చేతిని ముందుకు చాపుతుంది.. విక్రమ్ దగ్గరికి వచ్చి…విక్రమ్ నైనిక వైపు చూసి రెండు చేతులు జోడించి చిన్నగా నవ్వుతాడు..
అది చూసి నైనిక మొహం మడిపోయింది, కానీ ఫేస్ మీదకి స్మైల్ తెచ్చుకుని తను కూడా చేతిని వెనక్కి తీసుకుని చేతులు జోడిస్తుంది..
అదంతా ఒక పక్కన ఉండి చూస్తున్న విజ్జుకి అయితే నైనిక ఫేస్ చూసి చాలా నవ్వు వచ్చింది, కానీ బలవంతంగా నవ్వు ఆపుకున్నాడు..
తరువాత జయ గారు, “విక్రమ్ కూర్చో,” అని చెప్పి వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటారు.. విక్రమ్ కూడా తప్పక కూర్చుంటాడు..
అలా కూర్చుంటున్న అతను కోపంగా విజ్జు వైపు ఒక చూపు చూస్తాడు..
ఆ చూపు గమనించిన విజ్జుకి అందులో వంద అర్థాలు కనిపించాయి, కానీ వాటిని ఏమీ పట్టించుకోకుండా వచ్చి విక్కీ
పక్కనే ఉన్న మరొక సోఫాలో కూర్చుంటాడు..
అప్పటివరకు విజ్జుని గమనించని వాళ్ళు విజ్జు వైపు చూస్తారు ప్రశ్నార్థకంగా.. అది అర్థం చేసుకున్న జయ గారు, “నా కూతురు కొడుకు,” అని అంటారు.. నవ్వుతూ..
ఆ మాటకి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇద్దరూ ఇంకా అయోమయంగా ఆవిడ వైపు చూస్తారు..
“అదేంటి పెద్దమ్మ గారు, మీకు ఉన్నది ఒక కొడుకే కదా!” అని అడుగుతుంది శాంతి..
ఆ మాటకి ఆవిడ నవ్వుతూ, “నేను కన్నది ఒక కొడుకే అయినా, నాకు వరంలా మా జీవితంలోకి వచ్చింది.. నా కూతురు, ఆ క్షణం నుంచి నాకు కొడుకు మాత్రమే కాదు.. కూతురు కూడా ఉంది,” అని అంటారు..
వాళ్ళకి ఇంకా విషయం అర్థం కాలేదు కానీ మౌనంగా ఉన్నారు..
కానీ విజ్జుకి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది.. జయ గారి వైపు కన్నీళ్ళతో అలాగే చూస్తూ ఉన్నాడు..
అది గమనించిన విక్రమ్ కోపంగా విజ్జు వైపు చూస్తాడు..
అది చూసి విజ్జు చిన్నగా నవ్వుకుంటూ, ‘ఇడియట్’ అని మనసులో ముద్దుగా అనుకుంటూ వెంటనే తన కన్నీళ్ళను తుడుచుకుంటాడు..
ఆ తరువాత వాళ్ళు నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.. విక్రమ్ కి అక్కడ ఉండాలి అంటే చిరాకుగా ఉంది.. అందుకే వాళ్ళ నానమ్మ వైపు చూసి, “నానమ్మా, నాకు వర్క్ ఉంది.. నేను వెళ్తాను,” అని అంటాడు..
ఆవిడ విక్రమ్ వైపు ఒక క్షణం చూసి సరే అని తల ఊపుతారు..
విక్రమ్ చిన్నగా వాళ్ళ వైపు చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. విజ్జు కూడా విక్రమ్ వెనకాలే వెళ్తాడు.. ఎందుకంటే అప్పటికే విక్రమ్ నుంచి మెసేజ్ వచ్చింది, ‘నా రూమ్‌కి రా!’ అని,
అందుకే.. విక్రమ్ రూమ్‌కి వెళ్ళగానే విక్రమ్ కోపంగా విజ్జు వైపు చూస్తాడు..
అది గమనించిన విజ్జు, “అయ్యో! అదంతా నాకు తెలియదు బాబు.. నేను ఇంటికి వచ్చిన తరువాత నాకు విషయం తెలిసింది.. ఇదంతా అమ్మమ్మ ప్లాన్,” అని అంటాడు..
విక్రమ్ ఏమీ మాట్లాడకుండా, “డాడ్ ఎక్కడ?” అని అడుగుతాడు..
“మావయ్య కంపెనీలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని మార్నింగ్ వెళ్ళారు,” అని అంటాడు..
విక్రమ్ మౌనంగా తన బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు.. అక్కడ నుంచుని అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ కళ్ళు మూసుకుంటాడు..
తనకి మనసంతా గందరగోళంగా ఉంది.. ఎందుకో ఏదీ నచ్చటం లేదు.. ఇలా తన నానమ్మ ఎప్పుడూ అంతే..
తనకి ఎప్పుడు పెళ్ళి చేయాలా అని చూస్తుంది.. ఎన్నిసార్లు వద్దు అని చెప్పినా ఆవిడ ప్రయత్నాలు మానదు..
అలా అని తన మనసులోని మాట ఆవిడకి చెప్పలేడు..
ఏమని చెప్తాడు? ఎవరో తెలియదు.. ఎలా ఉంటుందో తెలియదు.. అసలు తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు.. కేవలం పేరు మాత్రమే తెలుసు.. అందుకే మౌనంగా ఉన్నాడు, ఏమి చేయాలో తెలియక..
విజ్జు విక్రమ్ వెనకాల నిలబడి, “ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది బావ, చైన్ గురించి..” అని అంటాడు..
ఆ మాటకి వెంటనే కళ్ళు తెరిచి విజ్జు వైపు చూస్తాడు విక్రమ్..
ఇంకా ఉంది…
Swipe left/right or tap the sides to turn pages