New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 45

పెళ్లి చూపులు – 45

పెళ్లి చూపులు -45

 

గౌతమి కూడా వాళ్లకు హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గరకు వెళ్లాలి అనుకుంది. కానీ మరల వాళ్ళు తనని తిడితే దూరం పెడితే నేను వాళ్ళ మీద రివర్స్ అవుతానేమో మరల నేను ఇలాంటి తప్పులు చేస్తానేమో, వాళ్ల దగ్గరకు వెళ్ళటానికి కూడా నాకు మొఖం చెల్లడం లేదు అని బాధపడుతూ దూరంగా కూర్చుని వాళ్ళ వైపే చూస్తూ ఉంది.

 

అలా టైం 7:00 కొట్టింది వైష్ణవ్ అప్పుడు  సిస్టం నుంచి పక్కకు తిరగకుండా కనీసం తల కూడా పక్కకు తిప్పకుండా వర్క్ చేస్తూ ఉన్న సిరి రమ్య రవి ముగ్గురుని చూసి “సిరి ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఏదైనా వర్క్ ఉంటే నేను చూస్తాను రేపు ఉదయం 11 గంటలకు కదా మీటింగ్ ఆలోపు మనం వర్క్ కంప్లీట్ చేద్దాం, ఈ టైం లో ఇంకా మీరు ఆఫీస్ లో ఉండటం కూడా కరెక్ట్ కాదు వెళ్లిపోండి నేను ఏదైనా ఉంటే చూసుకొని వస్తాను” అని అన్నాడు 

 

“నిన్ను ఒక్కడిని ఇంత పెద్ద ప్రాబ్లం లో వదిలేసి మేము మాత్రం ఎలా వెళ్లిపోగలం, ఉంటే అందరం కలిసి వర్క్ చేద్దాం లేదంటే అందరం కలిసి వెళ్లిపోదాం అంతేగాని నిన్ను ఒక్కడినే వదిలిపెట్టి మాత్రం  మేం వెళ్ళాము” అని అన్నది సిరి..

 

రవి రమ్య ఇద్దరు కూడా “అవును వైష్ణవ్ సిరి చెప్పింది కరెక్ట్. వెళ్తే అందరం వెళ్దాం లేదంటే అందరం ఉందాం” అని చెప్పింది..

 

వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉండటం తనకు హెల్ప్ చేస్తాను అని అనటంతో చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ టైంలో నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ కదా కావాలి, సిరి లాంటి వైఫ్ వస్తే ఇక ఆ మగాడి లైఫ్ కచ్చితంగా బిందాస్ గా ఉంటుంది అని మనసులో అనుకున్నాడు అలా మురిపంగా ప్రేమగా సిరివైపు చూస్తూ ఉన్నాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue