పెళ్లి చూపులు -63
“రమ్య కి పెళ్లయిపోతుంది ఇక ఏంటి నెక్స్ట్ నీ ప్లాన్స్” అని అడిగాడు వైష్ణవ్
“నాకా ప్లాన్ అంటూ పట్టికలర్గా ఏమీ లేదు. దాని పెళ్లిని ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేయాలి” అని నవ్వుతూ అన్నది
“నేను అనేది రమ్య పెళ్లిలో నువ్వు ఏ విధంగా ఎంజాయ్ చేస్తావు అని కాదు, ఆ తర్వాత నీ ప్లాన్స్ అంటే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది.. అప్పుడు నువ్వు ఒక్కదానివే కదా నువ్వు పెళ్లి చేసుకోవా..?” అని అడిగాడు వైష్ణవ్
అప్పటివరకు నవ్వుతూ ఉన్నది కాస్త డల్ గా మారిపోయింది, బయటకి చూస్తూ “పెళ్లి అనేది నా జీవితంలో లేదు. నా రాతలో ఆ భగవంతుడు రాయలేదేమో, దాని గురించి కూడా నేను ఆలోచించాలి అనుకోవడం లేదు. ఇలా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ కావలసింది తింటూ, వెళ్ళాలి అనుకున్నా ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ లైఫ్ అంతా గడిపేయటమే” అని వైష్ణవ్ వైపు తిరిగి అల్లరిగా కన్ను కొడుతూ అన్నది.
ఆమె అలా అల్లరిగా మాట్లాడుతున్న మనసు లోపల ఎంత బాధ పడుతుంది అనేది అర్థం చేసుకున్న వైష్ణవ్ “అదేంటి అలా మాట్లాడతావ్ కచ్చితంగా నీకు పెళ్లి జరుగుతుంది కదా..! అసలు పెళ్ళే జరగదు అన్నట్టు మాట్లాడతావేంటి” అని అడిగాడు