నాకు ఇద్దరు కావాలి.. మా ముగ్గురి మధ్యలో దియా భవిష్యత్తు ఉండాలి, ఉంటుంది.. అని బాటిల్ మీద కళ్ళు నిలిపి చిన్న గొంతుకుతో చెప్పినా అర్జున్ నిర్ణయంలో దృఢత్వం ధ్వనిస్తోంది.
చంద్రశేఖర్ గారు ఏది మాట్లాడలేదు, నెమ్మదిగా అర్జున్ చేతుల మధ్య ఉన్న బాటిల్ మీద తన చేతిని ఉంచితే అప్పుడు ఆయన ముఖంలోకి చూశాడు అర్జున్.
చట్టంతో అవసరం లేకుండా సమాజాన్ని పట్టించుకోకుండా బ్రతకాలి అనుకుంటున్నాను. బట్టలు లేని నన్ను కుక్కలు తరుముతున్నప్పుడు ఈ సమాజం పట్టించుకోలేదు. నన్ను అనాధ అని గేలి చేసి కొట్టినప్పుడు ఈ చట్టం చూడలేదు.