New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 15

మై మాఫియా డాన్ – 15

ఒక  సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన అన్విక తన గదిలో కూర్చుని తన ఫోన్ చూసుకుంటోంది. ఫోన్లో పార్క్ తాను రన్వీర్ తీసుకున్న ఫొటోస్ చూస్తూ ఉంది.

 

కానీ అదే సమయంలో, ఆమె తండ్రి శ్రీనివాస్ గారు తన ఆఫీస్ పనులు ముగించుకుని బైక్ మీద ఇంటికి వస్తున్నారు.

 

మెయిన్ రోడ్డు దాటి ఇంటి వైపు వచ్చే గల్లీలోకి తిరుగుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక నంబర్ ప్లేట్ లేని నల్లటి స్కార్పియో కారు అతివేగంగా వచ్చి ఆయన బైక్‌ను ఢీకొట్టింది.

 

ఆ దెబ్బకు శ్రీనివాస్ గారు గాలిలోకి ఎగిరి పది అడుగుల దూరంలో ఉన్న సిమెంట్ రోడ్డు మీద పడిపోయారు. ఆయన కాలు మీద నుంచి కారు చక్రం వెళ్ళిపోయింది.

 

ఒక్క నిమిషం అంతా నిశ్శబ్దం.. ఆ తర్వాత అక్కడ ఉన్న స్థానికులు పరుగున వచ్చారు.ఆ కారు ఆగకుండా మెరుపు వేగంతో అక్కడి నుంచి మాయమైపోయింది.

 

చుట్టుపక్కల వారు వెంటనే శ్రీనివాస్ గారి జేబులో ఉన్న ఫోన్ తీసి, చివరిగా డయల్ చేసిన నంబర్‌కు కాల్ చేశారు. అది అన్విక నంబర్.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue