New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనమే ని భాష – 15

మౌనమే ని భాష – 15

ఆరోజు వంశీకి ఆఫీసులో అస్సలు ఏకాగ్రత కుదరలేదు. ఎప్పుడెప్పుడు ఆ డైరీని తెరుద్దామా, ఆ శ్రావణి జీవితంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం అని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది.

 

కానీ బ్యాగ్ లో ఉన్న ఆ పుస్తకాన్ని తీయడానికి ఒక్క క్షణం కూడా ఖాళీ దొరకలేదు.

 

ఆఫీస్ వర్క్ ఒత్తిడి ఒకవైపు, తన చుట్టూ ఉండే కొలీగ్స్ హడావిడి మరోవైపు.మధ్యాహ్నం లంచ్ టైమ్ అయింది.

 

హమ్మయ్య.. ఇప్పుడు చదువుకోవచ్చు అనుకుని వంశీ మెల్లగా తన సీటు దగ్గర డైరీ తీయబోయాడు. సరిగ్గా అదే సమయానికి అతని ఫ్రెండ్స్ అంతా చుట్టుముట్టారు.

 

ఏంటి వంశీ.. సీటు దగ్గరే కూర్చున్నావు? రా లంచ్ కి వెళ్దాం అంటూ రవి, మాధవ్ వచ్చి పలకరించారు. వంశీకి ఆ డైరీని మళ్ళీ బ్యాగ్ లో పెట్టక తప్పలేదు. 

 

లంచ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా వంశీ మనసంతా ఎక్కడో ఉంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue