New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 36

మౌనమే ని భాష – 36

కిటికీ వెలుపల గాఢమైన చీకటి. వంశీకి ఇప్పుడు ఆ డైరీ చదవడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది అతని జీవితంలో ఒక భాగమైపోయింది. 

 

ఆఫీస్ నుండి రాగానే ఫ్రెష్ అయి, ఒక కప్పు కాఫీ పక్కన పెట్టుకుని, శ్రావణి ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతనికి ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోంది.

 

ఈరోజు డైరీ తెరిచిన వంశీకి, అందులోని అక్షరాలు కన్నీటి చారలతో తడిసినట్టు అనిపించాయి.

 

డైరీలో శ్రావణి తన తల్లితో మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్టుగా రాసుకున్న ఈ మాటలు వంశీని కలచివేసాయి.

 

అమ్మా.. ఎన్నాళ్ళో సాగిన ఈ అందమైన ప్రయాణం మళ్ళీ ఆగిపోయింది. స్నేహ వాళ్ళ అమ్మగారు నాకు ఒక నిండు కుటుంబాన్ని ఇచ్చారు. 

 

కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారి వైద్యం కోసం, ఆ హాస్పిటల్ కి దగ్గరగా ఉండాలని వాళ్ళు ఇల్లు మారిపోవాల్సి వస్తోంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue