New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 7

మౌనమే ని భాష – 7

ఇందులో నీ బాధలు ఉన్నా, నీ రహస్యాలు ఉన్నా అవి నా దగ్గర చాలా గౌరవంగా, భద్రంగా ఉంటాయి. కేవలం నిన్ను చేరుకోవాలనే తాపత్రయంతోనే నేను ఈ సాహసం చేస్తున్నాను. ప్లీజ్.. నన్ను తప్పుగా అనుకోకు అని మొదటి పేజీ తెరుస్తాడు.

 

వంశీ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. చేతిలో ఉన్న డైరీ ఒక పుస్తకంలా కాకుండా, ఒక మనిషి భారమైన హృదయంలా అనిపిస్తోంది అతనికి.

 

వంశీ మెల్లగా, చాలా గౌరవంగా మొదటి పేజీని తిప్పాడు.అతను ఊహించినట్టుగా అక్కడ అందమైన రాత లేదు. అక్షరాలు వంకరటింకరగా, తడబడుతూ ఉన్నాయి. 

 

ఆ రాత చూడగానే అర్థమవుతోంది.అది ఒక పదేళ్ల చిన్నారి తన చిన్ని చేతులతో రాసిన అక్షరాలని. ఆ పేజీ మీద అక్కడక్కడ నీటి చుక్కలు పడి ఆరిపోయిన గుర్తులు ఉన్నాయి. 

 

అవి అక్షరాల మీద పడ్డ కన్నీటి ముద్రలని వంశీకి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.

వంశీ ఆ మొదటి పేజీలోని మాటలను చదవడం మొదలుపెట్టాడు.

 

అమ్మా.. నాన్న..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue