రాక్షస ప్రేమ -18
“ఆ భయం ఉండకూడదు అంటున్నాను ఏదైనా ధైర్యంగా గొంతు ఎత్తి పోరాడాలి. ఆడపిల్ల అని వెనకడుగు వేస్తే అక్కడే నీ పతనం మొదలైనట్టు, ఇంకొకసారి ఎప్పుడూ ఇలాంటి సిల్లి మాటలు నాతో మాట్లాడొద్దు” అని చెప్పి అతను డ్రెస్ వేసుకున్నాడు.
ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా బాగా నచ్చేస్తున్నావురా అని వెనక నుండి అతనికి ఫ్లయింగ్ ఇచ్చి తనని తాను చూసుకొని కొన్ని కష్టాలు కూడా ఇష్టాలుగా మారి జీవితంలో ఒక మెమొరబుల్ గా ఉంటాయి లే, ఈ డ్రెస్ కాసేపటికి ఆరిపోతుందిలే అని అనుకుంటూ ఫ్యాన్ కింద చైర్ వేసుకుని కూర్చుంది.
రౌద్ర కూడా అక్కడ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే సోఫాలో కూర్చుని ఒక కంటితో ఆమె వైపు చూస్తూనే మరోక కంటితో ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉన్నాడు..
సాయంత్రం ఆఫీస్ టైం కంప్లీట్ అయిపోయింది కానీ విరాజిత ఇంటికి వెళ్ళలేదు. అక్కడే తన వర్క్ ప్లేస్ లో కూర్చుని ఉండిపోయింది.
విరాట్ అది గమనించి ఆమె దగ్గరకు వచ్చి విరా అని పిలవడంతో,
అప్పటివరకు మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్నది కాస్త అప్పుడు కళ్ళు తెరిచి చైర్ లో నుంచి పైకి లేచి అతడి చేతిని పట్టుకొని డైరెక్ట్ గా చైర్మన్ అయిన కార్తికేయ గారి రూమ్ కి తీసుకొని వెళ్ళిపోయింది..