New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస ప్రేమిక – 4

రాక్షస ప్రేమిక – 4

….”అసలు తను ఒంటరిగా హై వే మీద ఏం చేస్తుంది!?”….”తనని ఫాలో అయిన వాళ్ళు రౌడీలా… దీని వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా!?”…అని అనుకుంటూ….

 

సిస్టమ్ ఆన్ చేస్తాడు……

 

కానీ మైండ్ డిస్టర్బ్డ్ గా ఉండడం తో వెళ్ళు ముందుకి కదలను అంటూ మొండికేస్తుంటే… కష్టంగా కాన్సంట్రేషన్ పెట్టాలి అని ట్రై చేసిన తన వల్ల అవ్వకపోయేసరికి…దానిని క్లోజ్ చేసి…గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తారు…

 

 

నైట్ వర్క్ చేసే సెక్యూరిటీ వాళ్ళు ఉండడం తో…వాళ్ళని వేళ్లతోనే వెళ్ళిపోమని సైగ చేసి…బెడ్ మీద మత్తుగా పడుకున్న అలకనంద వైపు చూస్తాడు…ఒకవేళ తన నిద్ర లేగిస్తే…అతని గురించి తప్పుగా ఏమైనా అనుకుంటుందా….తిరిగి తను మళ్ళీ వెళ్ళిపోతాను అంటుందా…ఇలా పలు ఆలోచనలు అతనిని చుట్టు ముడితే తీక్షణంగా కాసేపు తన వైపు చూసి…పక్క నుండి వెళ్దాం అనుకునేసరికి….తన రైట్ హ్యాండ్ రిస్ట్ మీద ఒక టాటూ అతడి కళ్ళకి కనిపిస్తుంది…

 

 

ఒకేసారి అతని కళ్ళు మెరిస్తే..క్షుణ్నంగా చిన్నగా ఉన్న ఆ టాటూ నీ గమనిస్తాడు…”ఏ..ఎన్అ”ని ఉన్న టాటూ నీ చూసి…అతని చేతి వైపు చూస్తాడు…సర్రిగ్గా అలాంటి టాటూ నే అతని చేతికి ఉండడం తో…చిన్న నవ్వు అలా వచ్చి ఇలా మాయం అయితే…తన చేతి మళ్ళీ జాగ్రత్తగా బెడ్ మీద పెట్టీ… ఏసి టెంపరేచర్ ఇంకా తగ్గించి…బ్లాంకెట్ కప్పి…రూమ్ డోర్ క్లోజ్ చేసి…పైన తన రూమ్ వెళ్ళిపోతాడు…

 

~~~~~~~~~~~~

 

మార్నింగ్ అలకనంద కి లైట్ గా మెలుకువ వస్తే….కుడి చేత్తో తల పట్టుకుంటూ…ఎడమ చేతి నొప్పి గట్టిగా తెలుస్తుంటే….పంటి బిగువున నొప్పి నీ భరిస్తూ….లెగిసి కూర్చుంటుంది…చుట్టు చూసిన తనకి హై క్లాస్ ఇంట్లో ఉన్నానని అర్థమైతే….

 

లెగిసి మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని..ఎదురుగా చూసేసరికి….కాలు మీద కాలు వేసుకుని ఒక చేత్తో ఫోన్ చూస్తూ…ఇంకో చేత్తో ప్రోటీన్ షేక్ తాగుతూ…. జిమ్ అవుట్ఫిట్ లో ఉన్న అతనిని చూడగానే భయం టెన్షన్….తో పాటు…మనసులో…”ఏం ఉన్నాడు రా బాబు!!”అని అనిపిస్తుంటే….

 

 

“”చి..నేను ఏంటి ఇలా ఆలోచిస్తున్న!!”అనుకుంటూ….ఒక అడుగు ముందుకి వేసి…మెల్లగా గొంతు సరిచేసుకుని…”ఓయ్ మీ పేరు ఏంటి!!??”అని అడిగే ప్రయత్నం చేయబోయి…తల పైకి ఎత్తి చూసేసరికి….పెద్ద ఫోటో ఫ్రేమ్ లో సిగ్నేచర్ చూసి….”అగస్త్య నందన్!!”అని ఉండడం చూసి…

 

 

“అంటే ఈయన పేరు అదే నా…ఒకసారి టెస్ట్ చేస్తే పోలే!!”అని అనుకుంటూ…

 

మెల్లగా…”అగస్త్య గా……రు….!!”అని పిలుస్తుంది…

 

పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తే…వాళ్ళు “వద్దు మేడం అలా పిలవద్దు!!” అని సైగ చేసిన…

 

మళ్ళీ “అగస్త్య నందన్ గారు!”అని పిలుస్తుంది అలకనంద…

 

 

తల పైకి ఎత్తి చూసేసరికి…అతడి చూపు గట్టిగా అలకనంద కి గుచ్చుకుంటే…అతడి జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే…. అతడు సోఫా లో నుండి లెగిసి… ఒక ఐబ్రో రైజ్ చేసి…”నా పేరు మీకెలా తెలుసు!?”అని అడుగుతాడు సూటిగా…

 

అలకనంద తన చూపుడు వేలితో అక్కడ ఉన్న సిగ్నేచర్ ఫ్రేమ్ చూపించేసరికి…అగస్త్య తల ఊపి…సెక్యూరిటీ వాళ్ళ వైపు ఒక చూపు చూస్తే…అక్కడి నుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ…పక్కకి వెళ్ళిపోతే…

 

 

సోఫా లో నుండి లెగుస్తాడు అగస్త్య…. అలకనంద భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తే….అగస్త్య ఒక అడుగు ముందుకి వేసి…”హ్యాండ్ ఎలా ఉంది!?”అని అడగడం కంప్లీట్ అవ్వకుండానే….

 

నందు మాట్లాడుతూ….”మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు సార్…. ప్లీజ్ నన్ను వదిలేయండి కావాలంటే మా డాడీ ని అడిగి ఎంత మనీ అయినా ఇస్తాను!!”అని అంటుంది…

 

 

అగస్త్య సైడ్ స్మైల్ చేస్తూ…”డు యూ రియల్లీ ఫీల్ ఐ లైక్ మనీ!?…ఇంత ప్యాలెస్ ఉంది నాకు…అలాంటిది నీ మని కోసం…”అని అడుగుతాడు షార్ప్ గా…

 

నందు చుట్టు చూస్తూ…అతడు చెప్పేది ఒకరకంగా నిజం అని గ్రహిస్తూ..”నో”అని తల అడ్డంగా ఊపేసరికి….

 

అగస్త్య నందు చెయ్యి వైపు చూసి…కాస్త స్వెల్ అయ్యినట్టు తెలుస్తుంటే…”గెట్ రెడీ… వి హేవ్ టు గో టు ది హాస్పిటల్!!”అని చెప్తాడు…

 

ఆ మాటకి ఒకేసారి అలకనంద కళ్ళు పెద్దవి అయ్యి షాక్ అవుతుంది హాస్పిటల్ కి ఎందుకా అని…

 

~~~~~~~~~

 

అగస్త్య అసలు అలకనంద నీ హాస్పిటల్ ఎందుకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు…మీకు ఎపిసోడ్ నచ్చిందా అయితే మరి మీ అభిప్రాయాలని సమీక్షలో తెలియజేయండి బంగారమ్స్ 🤌🏻😍❤️