కృష్ణా కాలేజ్ ఆఁ..?? కాలేజ్ లో పనేంటి సర్..? అన్నాడు విష్ణు.
హ్మ్.. తరువాత చెప్తాను విష్ణు.. ముందు నేను చెప్పినట్టు చెయ్యి.. ముందు కాలేజ్ కి వెళ్ళు.. అన్నాడు వీర్.
సరే.. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను.. నేను దగ్గర్లోనే ఉన్నాను.. అని ఫోన్ పెట్టేసాడు విష్ణు.
తన వైపు శ్రద్ధ గా చూస్తున్న శారద వైపు చూసి.. ఏంటి అలా చూస్తున్నారు? అని అడిగాడు వీర్ ఫోన్ జేబులో పెట్టుకుంటూ.
నువ్వు ప్రతాప్ మేనల్లుడివి కదా.. కుటుంబం మొత్తం చనిపోతే ఆస్థి నీకొచ్చే అవకాశం ఉంది కదా.. అయినా నువ్వు ప్రతాప్ వదిలేసిన బంధాన్ని వెదుక్కుంటూ వచ్చావ్ అంటే.. ఇంటరెస్టింగ్.. అంది శారద.
ఆమె వైపు షార్ప్ గా చూసి.. ఇప్పుడు మా మావయ్య ఆస్థి.. మహాలక్ష్మి కూడా కదా.. అని లేచి,