విధి కలిపిన బంధం – 2
ఆదర్ష్ అంకిత ని కొట్టేసరికి బాధ ఆశ్చర్యం రెండు కలిపి చూసింది…. అసలు ఏమనుకుంటున్నారే మీ అమ్మాయిలు మీ ఇష్టానికి ఇంట్లో నుంచి పారిపోయి రావడం ఎలా పడితే అలా తిరిగేసి ఇంట్లో వాళ్ళ పరువులు తీస్తున్నారు….
చ అని అసహ్యించుకుంటూ చూసాడు…. అసలు ఎవరు మీరు నన్నెందుకు కొట్టారు అసలేందుకు తీస్కోచ్చారు నా గురించి మీకేమి తెలుసు అని ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అనింది కోపం బాధ కలగలిపి….
ఇలా చేసే వాళ్ళందరూ ఏదొక చెత్త రీసన్సె కదా చెప్తారు అని అసభ్యంగా మాట్లాడాడు…. చి నువ్వసలు మనిషివేనా ఒక ఆడపిల్ల గురించి ఇలానేనా మాట్లాడేది అనింది…. హేయ్ నాకు నీతో ఎదో సోదంతా మాట్లాడే ఓపిక లేదు నాకు నీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి అందుకోసమే నిన్ను తీస్కోచ్చాను అన్నాడు….
హెల్పా నా నుంచా ఏంటి అది అని అడిగింది అనుమానం గా ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ లో ఒక ఫోటో తీసి చూయించాడు అది చూసి ఆశ్చర్య పోయింది అంకిత….
ఈ ఫోటో లో ఉంది ఎవరు అని అడిగింది…. తను నా మరదలు పేరు అక్షిత ఇది కూడా నీ లాగే పిచ్చెక్కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది…. అది వెళ్లిన దగ్గర నుంచి మా అత్త తిండి నిద్రలు మాని మంచం పట్టింది….
నాకు మా అత్త అన్నా మా నాన్నమ్మ అన్నా ఒక అక్క ఉంది తను వీళ్ళ ముగ్గురు నా పంచ ప్రాణాలు వీళ్లలో ఒకళ్ళకి ఏమైనా అయినా నేను తట్టుకోలేను అని చెప్పాడు….
అంకిత ఆశ్చర్య పోయి చూస్తూ ఉంది ఏంటి ఆ చూపు తననే తెచ్చుకోవచ్చు కదా నేనెందుకు అనా నీ సందేహం అన్నాడు…. హ అని తల ఊపింది…. ఎందుకో ముందు కార్ ఎక్కు చెప్తాను అన్నాడు….
అలాగే అంటూ ఒక బొమ్మ లాగా ఎక్కి కూర్చుంది…. ఒక చోట కి తీసుకోచ్చి కార్ ఆపాడు నువ్వు ముందు నీ ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకొ అన్నాడు…. ఎందుకు అన్నట్టు చూసింది చెప్పింది చేయి చాలు క్వశ్చన్స్ అడగకుండా అన్నాడు గంబీరంగా….
అలానే చేసింది దిగి రా అని చెప్పి గదిమాడు…. భయం భయంగానే చూసింది అంతా చూస్తూ వస్తూ ఉంది…. ఒక దగ్గరికి వెళ్ళాక ఎవరితోనో ఎదో మాట్లాడి లోపలికి రా అని పిలిచాడు….
అక్కడికి వెళ్తే ముక్కు పగిలేలా ఎదో వాసన వస్తుంది…. అది పీల్చలేక ముక్కు గట్టిగ మూసుకొని ముందుకు వంగి చూసింది అసలు ఇక్కడ ఏముందా అని… అందులో ఒక డెడ్‌బాడీ ఉంది….
అది ఎవరిదో కాదు అక్షిత ది అంకిత అదిరిపడి గట్టిగ అరిచింది భయంతో…. హుష్ అరవకు ఎవరికి అయినా వినిపించిద్ది…. ఇది సాయం పట్టు మన కార్లో పెట్టాలి దీనిని అన్నాడు….
ఏంటి నేను సాయం పట్టాలా అది కూడా శవాన్ని అమ్మో నా వల్ల కాదు అనింది భయంతో…. హేయ్ చెప్పింది చేయి చాలు ఇంకా ఇక్కడే కానీ ఉందంటే స్మెల్ వచ్చేసిద్ధి అన్నాడు….
ఇంక అంకిత తప్పదా అన్నట్టు చూసింది ఆదర్ష్ వైపు తప్పదు నేను నిన్ను కాపాడాను కాబట్టి నువ్వు నాకు ఈ చిన్న సహాయం దీని తర్వాత ఇంకోక చిన్న పెద్ద సహాయం చేసి తీరాలి అన్నాడు….
ఏంటి ఇది చిన్న సహాయమా శవాన్ని మోపిస్తున్నాడు నా చేత ఇది చిన్నది అంట దేవుడా దీనికన్నా నేను స్టేషన్ లో కూర్చొని ఉండటమే మేలు ఏమో అనుకుంది మనసులో….
హో అవునా అయితే వదిలేసి రమ్మంటావా మళ్ళీ అన్నాడు…. ఎక్కడ అనింది స్టేషన్ లో అన్నాడు…. అమ్మో మనసులో మాటలు వినిపిస్తున్నాయా అని అనుకోని సైలెంట్ అయ్యింది….
ఇద్దరు కష్టంగా మోసుకొచ్చి కార్లో ఎక్కిచ్చారు…. ఆ తర్వాత ఇద్దరు కూడా కార్ ఎక్కి సిటీ ఔట్‌స్కర్ట్స్ వైపు పోనిచ్చాడు…. ఈ లోపు ఎదో చెకింగ్ కూడా జరుగుతుంది….
అది చూసి ఇద్దరు భయపడ్డారు ఇప్పుడు ఇది చుస్తే మన తప్పు లేకపోయినా మనదే తప్పు అంటారు ఇప్పుడు ఎలా ఎలా అని అనుకుంటూ చేతులు టెన్షన్ తో ఆడిస్తూ ఉన్నాడు….
ఇంతలో ఆదర్ష్ ఫోన్ మోగింది…. అది ఎవరా అని చుస్తే సిస్టర్ అని ఉంది దాని మీద…. ఇంక ఫోన్ లిఫ్ట్ చేసి లవ్లీ చెప్పరా అన్నాడు…. అన్నయ్య అత్త వదిన కోసం కలవరిస్తుంది రా ఎలాగైనా వదిన ని తెచ్చి అత్త ముందు నిలబెట్టు లేకపోతే మనకి అత్త దక్కదు అని చెప్పింది ఏడుస్తూ….
రేయ్ ప్లీజ్ రా నువ్వేమి కంగారు పడకు ఒకసారి ఫోన్ నానమ్మ కి ఇవ్వు అన్నాడు…. నాని అన్నయ్య ఫోన్ హలో కన్నయ్య మన అక్షమ్మ ని ఎలా అయినా తీసుకొని రా బాబు లేకపోతే అత్త మనకి దక్కదు అని కంట తడి పెట్టారు….
నానమ్మ అక్షిత నాతోనే ఉంది ఇంకో రెండు రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తాను తనని అని చెప్పి పని ఉంది అని ఫోన్ పెట్టేసాడు….
నేను వస్తాను అని మీతో ఎక్కడ చెప్పలేదు కదా అనింది అంకిత….ఇప్పుడు నాకు దాని గురించి మాట్లాడే అంత టైమ్ లేదు ముందు ఈ అక్షిత గురించి చూసి ఆ తర్వాత ఆలోచిస్తాను నిన్ను అంకిత గా ఉంచాలా లేక అక్షిత గా మార్చాలా అనేది అని కార్ని ఎక్కడ ఆపకుండా ఎవరు ఆపిన ఆపకుండా స్పీడ్ గా పోనించాడు….
హ్మ్ మరి అక్షిత చనిపోయింది….
అంకిత నిర్ణయం ఎటు వైపు అక్షిత గానా లేక తన లానే ఉండిపోయిద్దా అనేది….
నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం…
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంకా సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages