వేచానయ్య నీకోసం 🤍 – 4
కోడలి మాటకి ఇంకా పెద్దావిడ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది…
ఆర్యన్ ఫ్రెష్ అయ్యి రావడంతో అతనికి జింజర్ వాటర్ కలిపి ఇవ్వడంతో అది తాగుతూ గార్డెన్లో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు…
ద్రుడమైన శరీరం, ఈ కాలంలో పదేళ్ల పిల్లలకు కూడా కళ్ళకి అద్దాలు వస్తూ ఉంటే 28 ఏళ్ల వయసులో కూడా అతను కిలోమీటర్ అవతల ఉన్న బోర్డు మీద అక్షరాలని చిటికెలో చదవగలడు….
అతని చేతులు నరాలు తేలి అతను చేస్తున్న కఠినమైన ప్రాక్టీస్ కి గుర్తుగా ఒళ్ళు జలదరించే అంత స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటాయి….
చల్లగాలీకి గంటసేపు వాకింగ్ చేశాక అతను రూమ్ లోకి వెళ్లి మూవీ చూస్తూ కూర్చుని పోతే కావేరి నైట్ డిన్నర్ పనుల్లో ఉంటే పెద్దావిడ తను చూసుకుని డైరీ సీరియల్స్ చూస్తూ కూర్చుండిపోయింది….
జగన్నాధ్ గారు రియల్ ఎస్టేట్లో పేరు మోసిన రియల్ రియల్ ఎస్టేట్ టైకూన్…. తనని తొక్కాలనుకునే వాళ్ళని తొక్కుకుంటూ పోటీ వచ్చే వాళ్ళని తన మనుషులుగా మార్చుకుంటూ డేంజరస్ గా ఎదిగాడు….
****************
అనుకున్నట్టుగా ఆరోజు సాయంత్రానికి గాయత్రి వాళ్ళ పెద్దమ్మ కుటుంబం రావడమే కాకుండా గాయత్రి వాళ్ళ ముగ్గురు మేనమామలు కూడా ఇంటికి వచ్చారు…..
వాళ్లందరికీ దుర్గమ్మ హడావిడి హడావిడిగా తను చేసిన పిండి వంటలు వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇస్తూ ఉంటే రామయ్య గారు వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉంటే గాయత్రి మౌనంగా నిలబడడంతో “తల్లి ఇలా రా” అని మేనమామలు ప్రేమగా పిలవడంతో వెళ్లి వాళ్ళ మధ్యలో కూర్చుంది…
“చదువు ఎలా సాగుతుంది… అంత బాగానే ఉందా వెళ్లి వస్తూ ఉంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా?” అని మాట్లాడుతూ ఉంటే అంత బాగానే ఉందని వాళ్ళకి సమాధానం చెబుతూ ఉంటే అత్తలు కూడా ప్రేమగా వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు నగలు ఆమెకి ఇస్తున్నారు….
కూతుళ్లు కోడళ్ళు రావడంతో దుర్గమ్మ కి ఇంక వంట గదిలో పని లేకుండా పోయినా కూడా తన చేతి వంట తినిపించడం కోసం వద్దంటున్నా వంట గదిలోకి వెళ్లి ఏదో ఒకటి చేస్తూనే ఉంది….
గాయత్రి మౌనంగా మావయ్య వాళ్ళ పిల్లలు పెద్దమ్మ వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే “గాయత్రి అలా సైలెంట్ గా ఉండకు…. మాతోపాటు క్లోజ్ గా ఉండడానికి ట్రై చేయని” వాళ్ళందరూ చెబుతూ ఉంటే చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయింది గాయత్రి….
ఆరోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా “గాయత్రి నువ్వు ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకున్నావ్?* అని అడిగింది కావ్య….
గాయత్రి ఆమె వైపు చూస్తూ “బీకాం చేస్తున్నాను” అని చెప్పడంతో “సరే హైదరాబాదులో కూడా డిగ్రీ కాలేజీలు చాలా ఉన్నాయి…. మనం హైదరాబాద్ కి వెళ్ళాక నీకు ఒక మంచి కాలేజ్ వెతికి అక్కడ జాయిన్ చేస్తామని” చెప్పింది కావ్య….
గాయత్రి ఏదో చెప్పబోతు ఉండగానే దుర్గమ్మ ఆపేసి అందరికీ భోజనం పెట్టడంతో ఇంకా గాయత్రి మౌనంగా కూర్చుండిపోయింది….
**********************
“అమ్మాయిలకి సైట్ కొట్టడానికి లేదంటే టైం పాస్ చేయడానికి వేరే ఇంకేది దొరక్క ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు…. మాకు కావాల్సింది టాలెంటెడ్ పర్సన్స్” అని మేనేజర్ తిడుతున్నాడు…
ఆ మాటలు వింటూ పవన్ పిడికిలి బిగించి నిలబడితే “ఆర్యన్ ని చూసి నేర్చుకో…. నిన్నగాక మొన్న వచ్చాడు ఎంత శ్రమ పడుతున్నాడు…. బేసిక్ టెస్ట్ లోనే అతను ఇలా ఉన్నాడంటే ఫైనల్ టోర్నమెంట్లో అతన్ని కొట్టే వాడే ఉండడు…. అఫ్కోర్స్ అతని గేమింగ్ రికార్డ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది…. అడపాదడపా ఎక్కడో ఓడిపోయాడు తప్పితే మాక్సిమం అతనికి గెలిచిన కాంపిటీషన్స్ రికార్డ్ చాలా ఎక్కువగా ఉంది…. అతన్ని చూసి అయినా మోటివేట్ అవ్వండి” అని కోపంగా తిట్టి వెళ్లిపోయాడు మేనేజర్….
పవన్ వాళ్ల కోచ్ కూడా మరో నాలుగు మాటలు తిట్టి వెళ్లిపోవడంతో పవన్ పిడికిలి బిగిస్తే “ఆర్యన్ గాడికి వచ్చిన మూడు రోజుల్లోనే ఫాన్స్ ఎక్కువ అయిపోయారు…. వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయిలు కూడా వీడ్ని చూడడానికే వస్తున్నారని” పవన్ ఫ్రెండ్ రవి అన్నాడు….
“మూడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న మనకి కనీసం గుర్తింపు లేకపోతే మూడు రోజుల క్రితం వచ్చినవాడు మనల్ని డామినేట్ చేస్తున్నాడు అంటే వాడు ఇక్కడ ఉండకూడదని” పవన్ పిడికిలి బిగించాడు….
“ఏం చేస్తావ్ రా?” అని రవి అడగడంతో “చూస్తూ ఉండు” అని చెప్పి వెళ్ళిపోయాడు పవన్….
****************
మర్నాడు ఉదయాన్నే అందరూ లేచి బయటకు వచ్చేసరికి ఇంటి ముందు పెద్ద ముగ్గు రంగులు నింపి అందంగా ఉండడంతో “ఈ ముగ్గు వేసింది ఎవరు?” అని అందరు అడిగితే “ఇంకెవరు మన గాయత్రి” అంది దుర్గమ్మ…..
దాంతో మావయ్యలు వాళ్ళ కూతుళ్ళని పెద్దమ్మ కావ్యని తల మీద ఒక దెబ్బ వేసి “చూసి నేర్చుకోండి… ఎంత పెద్ద ముగ్గు మీరు నిద్రలేచేలోపు పూర్తి చేసేసిందో” అంటూ ఉంటే “తనకి అమ్మమ్మ నేర్పింది కాబట్టి వచ్చింది…. నాకెప్పుడైనా నువ్వు ముగ్గు నేర్పిస్తే కదా” అంది కావ్య….
“వంకలు చెప్పడానికి ముందు ఉంటావు” అంది గాయత్రి వాళ్ళ పెద్దమ్మ….
కంటిన్యూస్!!!!
Swipe left/right or tap the sides to turn pages