అగ్రిమెంట్❤️🔥లవ్ – 5
మంచి ప్లేస్, దూకితే డెఫినెట్ గా చస్తావ్. బట్ నేను మంచి అబ్బాయిని కాదు, అందుకే నీ ఫిగర్ చూసి నీకు ఒక ఆఫర్ ఇస్తున్న.
నచ్చి యూస్ చేసుకుంటే కామ్ గా నాతో పాటు వచ్చేయ్. లేదంటే కాప్స్ కి కాల్ చేస్తా అని బెదిరిస్తుంటే
కాప్స్ అనగానే వచ్చిన కంగారుతో అతను చెప్పేది అర్థం కాని కన్ఫ్యూషన్ లో కూడా వద్దు అని పెద్దగా అరిచింది సహస్ర.
తీయ్యని ఆ స్వరానికి, అందులోని భయానికి కళ్ళు ముడిచి చూస్తూ అయితే దిగిరా అన్నాడు ఆర్డర్ వేసినట్టే.
ఆశ లేని బ్రతుకు కోసం దిగితే ఉపయోగమేంటి అని ప్రశ్నించుకున్న సహస్ర అడుగు కదపలేదు.
వస్తావా పోలీసులకి ఫోన్ చేయమంటావా..?? అని ఈసారి సీరియస్ గా వాయిస్ రైస్ చేశాడు రాజ్.
ప్లీజ్ నన్ను బెదిరించద్దు, మీరు వెళ్లిపోండి అని కట్టలు తెంచుకుంటున్న కన్నీటిని అదుపు చేయాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్న గుండె బరువుతో రిక్వెస్ట్ చేసింది.
హలో మిస్ వైట్ సారీ.. చూడ్డానికి ఇంత సెక్సీగా ఉన్నా నిన్ను వదిలి వెళ్ళే సమస్యే లేదు. కామ్ గా కిందకి వస్తే డిస్కస్ చేద్దాం.
కాదు అని టైం వేస్ట్ చేసావ్ అనుకో, కాప్స్ కి కాల్ చేస్తా అని తన దగ్గర ఫోన్ లేదు అని తెలిసి కూడా పాకెట్లో హ్యాండ్ పెట్టి ఫోన్ తీస్తున్నట్టు ఆక్ట్ చేస్తుంటే
ప్లీజ్ అలా చేయొద్దు. లీవ్ మి అలోన్, దయచేసి వెళ్ళిపోండి. నేను ఉండడం వలన ఎవరికి ఎటువంటి యూస్ లేదు. చనిపోవడం వలన ఎవరికి ఎటువంటి నష్టం లేదు.
ప్లీజ్ నా చావు నన్ను చావనివ్వండి అని చేతులు జోడించింది సాహిత్య.
హేయ్ వైట్ సారి, నీకు నా కాన్సెప్ట్ అర్థం కాలా. నువ్వు బ్రతికితే నాకు యూస్ ఉంది. చస్తే నీ ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది అనేసరికి కళ్ళు పెద్దవి చేసి కన్ఫ్యూషన్ లో కూడా కోపంగా చూసింది సాహిత్య.
పైకి ఎక్కినంత ఫాస్ట్ గా నీ బుర్రకి నేను చెప్పేది ఎక్కడం లేదా?? అని విసుగ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నేను కాప్స్ కి కాల్ చేస్తే వాళ్ళు కచ్చితంగా వస్తారు.
ఈలోపు నువ్వు సక్సెస్ ఫుల్ గా చచ్చిన సరే నీ బాడీని ఫొటోస్ తీసి పేపర్లో వేస్తారు. అప్పుడు పబ్లిక్, ఫ్రెండ్స్, బంధువులు అని చెప్పుకునే రాబందులు నీ ఫ్యామిలీని ఏకీపారేస్తారు.
నాలుగు గోడల మధ్య బ్రతికే ఆడపిల్ల గురించి ఎవడు పట్టించుకోడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అందరూ అడిగే వాళ్లే. మానం పోయిందా, మర్యాద పోయే పని చేసిందా?? అత్యాచారం చేశారా, అబ్బాయిని ప్రేమించి మోసపోయిందా..??
ఆడపిల్ల మ్యాటర్ లో ఇవి తప్ప వేరే ప్రశ్నలు రావు. చచ్చి పబ్లిక్ ఫిగర్ గా మారి నీ ఫ్యామిలి పరువు తీసుకుంటావో, కిందకి వచ్చి సీక్రెట్ గా నా అగ్రిమెంట్ కి యాక్సెప్ట్ చేస్తావో నీ ఇష్టం..??? అని డెడ్ లైన్ ఫిక్స్ చేసి కన్నింగ్ లుక్స్ తో కామ్ గా నిలబడ్డాడు.
అగ్రిమెంట్ అనే మాట కన్నా ముందు రాజ్ చెప్పిన వన్నీ నిజాలే కావడంతో ఇప్పుడు తను సూసైడ్ చేసుకొని ప్రాణాలతో లేని తన తల్లిదండ్రుల పరువు తీయడం కన్న ఆగిపోవడం బెటర్ అనుకుంది సహస్ర.
బట్ బ్రతికి సాధించేది ఏముంది, ఎవరికోసం బ్రతకాలి?? అని ప్రశ్నలు గుండెని ఎత్తి పొడుస్తుంటే
ఎలాగో అతను చూశాడు. కిందకు వెళ్లే వరకు ఇలాగే విసిగిస్తాడు. వన్స్ కిందికి దిగి సూసైడ్ చేసుకోవడం లేదు అని నమ్మిస్తే అతని దారి నా అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అనుకొని నిస్సహాయంగా కళ్ళు విడుస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ నెమ్మదిగా కిందకు దిగుతుంటే
కొండ ఎడ్జ్ దగ్గరికి వచ్చి నిలబడ్డ రాజ్ చేతులు కట్టుకొని తనని కన్నార్పకుండా చూస్తున్నాడు.
కింద కంట వచ్చిన తనకి అట్లిస్ట్ హ్యాండ్ ఇచ్చి చివరి అడుగులో సపోర్ట్ కూడా ఇవ్వలేదు బలుపు బాబు.
అమ్మాయిల మీద స్పీచ్ ఇవ్వడమే తప్ప సపోర్ట్ ఇచ్చే అలవాటు లేదనుకుంటా అయ్యగారికి!!
కాళ్ళకి అడ్డు పడకుండా చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో పట్టుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చీకటిలో తచ్చాడుతు కిందకి వస్తున్న తన బాడీ మూమెంట్స్, తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ వాట్స్ యువర్ నేమ్?? అని అడిగాడు.
ఇంకా పూర్తిగా కిందికి రాని సహస్ర కొండ చివరి ఎత్తు మీదే ఆగి చూసింది అతని ప్రశ్నకి.
సూటిగా చురుకుగా తనని స్కాన్ చేస్తున్న అతని పదునైన చూపులకి, ఆ గొంతులోని సాఫ్ట్ నెస్ కి, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో షర్ట్ బటన్స్ పెట్టని అతని రఫ్ మెయింటినెన్స్ కి, హెల్ప్ చేయాలన్న ఆలోచన ఏం మాత్రం లేని అతని ఆటిట్యూడ్ కి.. చాలా డిఫరెంట్ గా ఉన్నాడు.
అసలు ఎవరు ఇతను, ఎందుకు నా చావుకి అడ్డుపడ్డాడు అనుకుంటూ ఎత్తు మీద నుంచి కిందకి పెడుతున్న కాలు పచ్చికలో ఉన్న రాయి మీద పడి పట్టు తప్పడంతో బాడీ బ్యాలెన్స్ తప్పి ముందుకు పడుతున్న సహస్ర ను తప్పించుకొని వెనక్కి అడుగులు వేశాడు రాజ్.
ఇంకా ఉంది..__
కామెంట్స్ మస్ట్ బేబీస్..
Swipe left/right or tap the sides to turn pages