అగ్రిమెంట్❤️🔥లవ్ – 4
గాలికి రెప రెపలాడుతున్న బ్లాక్ షర్ట్ అంచుల మధ్యన వెన్నెల వెలుగుకి స్ట్రెచ్ అవుతున్న అతని వైట్ టోన్ మజిల్స్, గాలి వాటంగా ఎగురుతున్న అతని సిల్కీ హెయిర్, కోటేరు ముక్కు, వాడైనా చూపులతో మెరుస్తున్న డార్క్ బ్రౌన్ ఐస్.. మొత్తానికి వెన్నెల రాతిరిలో చిందులేస్తున్న గ్రీకు గాడ్ లా ఉన్నాడు.
మంచు, చలి కూడా అతని హాట్ నెస్ కి చీకటితో కలిసి చిందులేస్తూ తమ హీట్నెస్ పెంచుకుంటున్నాయి.
చుక్క చుక్క చేరి సెలయేరులా మారి, నదిలా ప్రవహించి, సంద్రం ఆవిర్భవించడంలో లేని ఆశ్చర్యం.. సహస్ర కన్నీటికి కరిగిందేమో ప్రకృతి, ఆమె గుండెల్లోని ఆవేదనను అర్థం చేసుకుందేమో..
నోటిలో రాగానికి కాళ్లతో తాళం వేస్తూ ప్రకృతితో పని లేనట్టే పోతున్న రాజ్ వీర్ సిన్హా ను పిలవడంలో అతిశయం లేదు.
లోకంతో సంబంధమే లేనట్టు ఒకపక్క తనదైన సొంత లోకంలో తుల్లుతు వెళుతున్నది ఒకరైతే, లోకాన్ని వదిలి వెళ్లాలనుకుంటున్న వ్యక్తి ఇంకొకరు.
గాలి వాటానికి చెదిరి ఎగురుతున్న కన్నీటి చుక్కలు అతని చెంపను తాకాయి. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి తాకుతున్న నీతి బిందువులకు ఆగి పైకి చూశాడు రాజ్.. వర్షం అనుకొని.
ఇంత మంచు లో వర్షం ఏంటి?? అని చూపుడు వేలుతో చెంప మీద తడి రబ్ చేసుకుని ముందుకు అడుగు వేస్తున్న అతని కనురెప్పను తాకింది ఈసారి మరో నీటి బిందువు.
ఆ కంటిని మూస్తూ తల తిప్పిన అతని మరో కంటికి మంచు తెరల మధ్యలో తెల్లని ఆకారం కనిపించి ఆశ్చర్యపరిస్తే.. రెండో కంటిని కూడా తెరిచి నాకు తోడుగా ఒక ప్రేతం అనుకుంటూ కళ్ళను పొడిచి చూసాడు.
షార్ప్ గా స్కాన్ చేస్తున్న అతని కళ్ళకు తెల్లని చీరలో, నాగు పాము లాంటి పొడవాటి జడలో కనిపిస్తున్నది ప్రేతం కాదు పిల్ల అని కన్ఫర్మ్ చేసుకునే సరికి ఒళ్ళు జలదరించింది.
తాగిన మత్తు కాదు కదా అని తల కొట్టుకుంటూ సాహిత్య వైపు అడుగులు వేస్తున్న అతనికి చేరువవుతున్న తన రూపం ఈసారి క్లారిటీతో పాటు షాక్ కూడా ఇచ్చింది.
కారణం సహస్ర ఉన్నది సూసైడ్ స్పాట్!! ఆ పాయింట్ చూసి చుట్టూ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసిన అతనికి పర్టిక్యులర్‌గా ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామో తెలుస్తుంటే
ఎవరు ఇది.. పిల్ల, ప్రేతమా అని డౌట్ కొడుతున్న బుర్రకి క్లారిటీ ఇవ్వటం కోసం ఓయ్.. అని గట్టిగా అరిచాడు.
చావడానికి సిద్ధమైన శూన్య లోకంలో నిలబడిన సహస్ర కు అతని అరుపు వినబడలేదు.
జస్ట్ కొండ అంచుల మీద అలా ఉంది. కదిలిన, మెదిలిన పడిపోయే అంత చివరి అంచుల మీద.
కాళ్లతో కింద సెర్చ్ చేస్తూ, అటు ఇటు చూసిన అతనికి ఇంకెవరూ కనబడలేదు కానీ షూ కింద రాయి తగలడంతో వంగి అది చేతిలోకి తీసుకొని సహస్ర మీదకి విసురుతూ ఓయ్ వైట్ సారి.. అని ముందు కన్నా గట్టిగా అరిచాడు.
విసిరిన రాయి చీర అంచుల కింద నుంచి కాళ్లకు తగిలి తుళ్ళిపాటుతో కళ్ళు తెరిచిన సహస్ర చెవులకు వినిపించిన అరుపుకు తిరిగి చూసింది.
వెన్నెల ఆరబోసిన పిండి బొమ్మలా ఉంది తన రూపం.
వాట్ ఏ బ్యూటీ..?? అంటూ తనని చూసిన ఆ క్షణం అతని పర్మిషన్ లెకుండానే అతని మైండ్ రెస్పాండ్ అయింది.
స్లో మోషన్ లో కంగారు కలిసిన సహస్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న అతనిలో ఏదో తెలియని చిన్న గిలిగింత.. మనసును గిల్లీ అలా మాయమైపోయింది.
సూసైడ్ చేసుకుంటున్న సో కాల్డ్ బ్యూటీ. వదిలేస్తే చస్తుంది పట్టుకుంటే.?? అని ప్రశ్నించుకోగానే రాజ్ కళ్ళల్లో ఒక స్పార్క్ కింద పెదవి పంటి కింద బిగించి సహస్ర ను స్కాన్ చేస్తున్నాడు.
తడి కన్నులను టప టపా ఆర్పుతు.. ఆ టైంలో ఊహించని విధంగా అక్కడ మరొక మనిషిని చూసి నిర్ధాంతపోయింది సహస్ర.
సహస్ర కంగారును మరింత పెంచుతూ ఓయ్ ఏం చేస్తున్నావ్ అక్కడ..?? గద్దించినట్టే సీరియస్ గా అడిగాడు.
తల దించి తనకి అటు ఇటు చూసుకొని మళ్లీ తలపైకి ఎత్తి అతన్ని చూస్తూ ఏమీ లేదు అన్నట్టు కంగారుగా తల అటు ఇటు కదుపుతుంది సహస్ర.
కొండపల్లి బొమ్మలా అర్థం పర్థం లేకుండా అడ్డదిడ్డంగా తల కదుపుతున్న సహస్ర టెన్షన్.. రాజ్ కి ఫన్నీగా అనిపించింది.
అది సూసైడ్ పాయింట్.. చావడానికి ఎక్కావా?? అని సుత్తి లేకుండా స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తే అదే ప్రయత్నంలో ఉన్న సహస్ర అప్రయత్నంగానే ముందు నిలువుగా తల కదిపి వెంటనే కంగారుపడుతూ కాదు అని అడ్డంగా ఆడిస్తుంటే
అర్థమైందిలే చావడానికే ఎక్కావని. ఎక్కువగా టెన్షన్ పడకు, నాకు ఆన్సర్ చెప్పే లోపే పడిపోతావ్ అనగానే బెదిరిన సాహిత్య బాడీ తెలియకుండానే సన్నగా వనికింది.
మంచి ప్లేస్, దూకితే డెఫినెట్ గా చస్తావ్. బట్ నేను మంచి అబ్బాయిని కాదు, అందుకే నీ ఫిగర్ చూసి నీకు ఒక ఆఫర్ ఇస్తున్న.
నచ్చి యూస్ చేసుకుంటే కామ్ గా నాతో పాటు వచ్చేయ్. లేదంటే కాప్స్ కి కాల్ చేస్తా అని బెదిరిస్తుంటే
కాప్స్ అనగానే వచ్చిన కంగారుతో అతను చెప్పేది అర్థం కాని కన్ఫ్యూషన్ లో కూడా వద్దు అని పెద్దగా అరిచింది సహస్ర.
ఇంకా ఉంది..__
కామెంట్స్ మస్ట్ బేబీస్..
Swipe left/right or tap the sides to turn pages