అగ్రిమెంట్❤️🔥లవ్ – 3
తెరలు తెరలుగా గాలితో సుడులు తిరుగుతున్న పొగమంచు, వణికిస్తున్న చలికి కూడా చలించని గుండె బరువుతో పుట్టిన వైరాగ్యం సహస్ర ముఖంలో నిండుగా ఉంది.
ముందు అంతా అగాధం.. చూడాలంటేనే భయంగా ఉంది. తన వెనక అంతా పరుచుకున్న శూన్యం ముందుకే పొమ్మంటుంటే.. కన్నీళ్ళతో వెన్నెల అంచులు దాటి నల్లటి ఆకాశంలోకి చూస్తున్న సహస్ర మనసంతా కల్లోలం.
మీతో పాటే నన్ను కూడా తీసుకు వెళ్లిపోయి ఉంటే ఈరోజు ఆగాధం ముందు నిలబడి చావు కోసం వేడుకోవలసిన అవసరం వచ్చేది కాదు.
ఒకరి తరువాత ఒకరు నన్ను వదిలి వెళ్లి జతగా అక్కడ చేరి కన్నీళ్ళతో నిలబడిన నన్ను బాధగా చూస్తున్నారు కదా..??
మిమ్మల్ని ఇంతకు మించి నేను కష్ట పెట్టను, ఇంతకు మించి మిమ్మల్ని ఎదురు చూడనివ్వను.. మీ దగ్గరికే వచ్చేస్తున్నాను. మీ ఒడిలో సేద తీరడానికి వచ్చేస్తున్నాను.
మరొక జన్మంటూ ఉంటే మళ్ళీ మీకే పుట్టాలి.. చివరి వరకు మీతోనే కలిసి ఉండాలి, ఇలా ఒంటరిగా మాత్రం మిగలకూడదు.. అని దేవుడి కన్న ఎక్కువగా గౌరవించే తల్లిదండ్రులను తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది సహస్ర.
పొగ మంచు తెరలను చీల్చుకుంటూ హిల్ ఏరియా ఘాట్ రోడ్లో జుం జుం.. నా దూసుకుపోతుంది రాజ్ స్పోర్ట్స్ కార్.
ఒక చేత్తో చక్రాన్ని తిప్పుతూ, మరొక చేత్తో బీర్ తాగుతూ, హై వాల్యూమ్ లో వెస్ట్రన్ మ్యూజిక్ వింటున్నా అతని కాన్సన్ట్రేషన్ మొత్తం కాన్ఫిడెంట్ గా రోడ్డు మీదే ఉంది.
పదునైన అతని చూపులు, సూటిగా వెలుతురుతో సమానంగా గమ్యాన్ని అన్వేషిస్తుంటే ఆ వేగానికి తగ్గట్టు రాజ్ చెయ్యి స్టీరింగ్ తిప్పుతుంది.
బాడీ మీద ఫుల్ స్లీవ్స్, బటన్స్ పెట్టని బ్లాక్ షర్ట్ చెదిరి మధ్యలో నుంచి కనిపిస్తున్న చెస్ట్ మజిల్స్ స్ట్రాంగ్ గా, సెక్సీ గా మధ్య మధ్యలో పడుతున్న లైటింగ్ కి మెరుస్తూ వావ్.. అనిపిస్తుంటే సెక్సీ మోడల్ షూట్ జరుగుతున్న ఫీలింగ్ వస్తది చూసిన ఏ కంటి కైనా.
ఒత్తయిన అతని కనుబొమ్మలు కింద సీరియస్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న డార్క్ ఐస్ చిన్నవి అయ్యాయి వినిపిస్తున్న ఫోన్ రింగ్టోన్ కి.
కార్ స్పీడ్ తగ్గలేదు, బీర్ బాటిల్ బ్యాలెన్స్ గా సీట్లో పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ కట్ చేసి పక్కన పడేసి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకున్నాడు.
సెకన్స్ గ్యాప్ లోనే మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంటే బాటిల్ పైకెత్తి గుటక వేస్తూ ఫోన్ స్క్రీన్ వైపు చూసాడు.
సేమ్ నెంబర్ కనిపించి అతన్ని ఇరిటేట్ చేస్తే, బాటిల్ ఫోన్ స్క్రీన్ మీద పెట్టి కార్నర్ స్మైల్ తో స్టీరింగ్ తిప్పాడు.
నెక్స్ట్ సెకండ్ బాటిల్ పక్కకు పడింది, లక్షలు పోసి కొన్న ఫోన్ బీర్ కి బలయింది.
అది చూసి నవ్వుకుంటూ పడిపోయిన బాటిల్ తీసుకోవడానికి ముందుకు వంగడమే స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. మెయిన్ రోడ్ నుంచి కారు ట్రాక్ తప్పింది.
అతనిలో మాత్రం ఎటువంటి బెదురు, భయం, కంగారు లేదు. అవే పదునైన చూపులతో ఆరాంగా బాటిల్ తీసుకొని ఇంకొక గుటక వేసి సింగల్ హ్యాండ్ తోనే కారు స్పీడ్ ని, డైరెక్షన్ ని కంట్రోల్ చేస్తూ మొక్కల్ని పుట్టల్ని తొక్కించుకుంటూ పోయి చెట్టుకి ముద్దు ఇవ్వడంతో స్టీరింగ్ మీదకు పడ్డాడు.
మ్యూజిక్ ఆగలేదు, అబ్బాయి గారిలో బలుపు దిగలేదు. ఎయిర్ బాగ్ బ్లాస్ట్ అవ్వడంతో దానికి పంచ్ ఇచ్చి బీర్ బాటిల్ తో కార్ దిగిన బలుపు మాస్టర్ అరుస్తున్నా కార్ కు లెఫ్ట్ లెగ్ తో కిక్ ఇచ్చి.. డామిట్ డౌన్ సైడ్ కి రోడ్స్ వేయకూడదన్న సెన్స్ లేదు అని ఇరిటేట్ అవుతూ బీర్ బాటిల్ పైకి ఎత్తాడు.
ఫోన్ ని సగం అభిషేకించిన బీర్ ఆఖరి సిప్ అవడంతో అది ఫినిష్ చేసి బాటిల్ విసిరికొట్టి మంచు దుప్పటి కప్పుకున్న కొండ ప్రాంతమంతా కళ్ళు తిప్పి చూసాడు.
బ్యాక్ సైడ్ దట్టమైన చెట్లు, ఫ్రంట్ సైడ్ ఎతైన కొండలు. నెత్తి మీద నిండు చంద్రుడు, నెలంతా గుబురు మొక్కలతో నిండిన కటిక చీకటి. మధ్యలో దట్టమైన మంచు దుప్పటి.
దెయ్యాలు, ప్రేతాలు తిరగడానికి పర్ఫెక్ట్ క్లైమేట్, పర్ఫెక్ట్ టైమింగ్ అని నిట్టూర్చి తనని తాను చూసుకుని పిశాచిలా నేను కూడా ఉన్న మీకు తోడు.. అనుకోగానే నవ్వొచ్చింది అతనికి.
ఏ డైరెక్షన్లో ఎక్కడికి వచ్చాడో కన్ఫ్యూజ్ గా ఉండి కార్ లోకి దూరి ఫోన్ తీసుకున్నాడు.
దానిని ముందుగానే బీర్ తో అభిషేకించాడుగా.. ఆన్ అవకుండా ‘ఇట్స్ మై టర్న్’ అని వెక్కిరించింది.
తిక్క రేగి దాన్ని కూడా విసిరికొట్టి, చెట్టు నీడ నుంచి ముందుకు వెళ్లి వెన్నెల వెలుగులో, మంచు దుప్పటి పరుచుకున్న పచ్చిక మీద వాకింగ్ స్టార్ట్ చేశాడు.
కార్ లైటింగ్ కనుమరుగైంది, దారి తెలియని దిశగా కార్ నుంచి దూరమైన అదే వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేసుకుంటూ అడుగులు వేస్తున్నాడు.
ఆ క్షణం అతన్ని అలా చూస్తే ప్రపంచంలో ఇంత హ్యాపీయస్ట్ పర్సన్ ఇంకెవరూ లేరు.. అనిపించే అంత ఆక్టివ్ గా మ్యూజిక్ తో పాటు బాడీని స్ప్రింగ్ లా మూవ్ చేస్తూ చిన్నచిన్న స్టెప్స్ వేస్తున్నాడు.
గాలికి రెప రెపలాడుతున్న బ్లాక్ షర్ట్ అంచుల మధ్యన వెన్నెల వెలుగుకి స్ట్రెచ్ అవుతున్న అతని వైట్ టోన్ మజిల్స్, గాలి వాటంగా ఎగురుతున్న అతని సిల్కీ హెయిర్, కోటేరు ముక్కు, వాడైనా చూపులతో మెరుస్తున్న డార్క్ బ్రౌన్ ఐస్.. మొత్తానికి వెన్నెల రాతిరిలో చిందులేస్తున్న గ్రీకు గాడ్ లా ఉన్నాడు.
మంచు, చలి కూడా అతని హాట్ నెస్ కి చీకటితో కలిసి చిందులేస్తూ తమ హీట్నెస్ పెంచుకుంటున్నాయి.
ఇంకా ఉంది..__
కామెంట్స్ మస్ట్ బేబీస్..
Swipe left/right or tap the sides to turn pages