** అజేయ – 52 **
సియా ఒడిలో డ్రాయింగ్ ప్యాడ్ పట్టుకొని , చలికి కాస్త వణుకుతున్న వేళ్ల మధ్య ఒక బ్లాక్ చార్‌కోల్ పెన్సిల్ బిగుతుగా పట్టుకుని ఉంది..
కిటికీ బయట కనిపిస్తున్న ఆ దట్టమైన చెట్లను, పొగమంచులో మునిగిపోతున్న చీకటి కొండలను శూన్యంగా చూస్తూ, తన పెన్సిల్‌తో కాన్వాస్ పై బందించే ప్రయత్నం చేస్తుంది..
నిజానికి ఆమె కళ్ళు బయటి ప్రకృతిని చూస్తున్నా, ఆమె మనసు మాత్రం మరెక్కడో ఉంది..
రాఘవ్‌ని కలిసినప్పటి నుండి సియా మైండ్ అస్సలు స్థిమితంగా లేదు. ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆమె గుండె వేగం పెరుగుతోంది..