** అజేయ – 62**
రాఘవ్ మాటలకి చిన్నగా నవ్వినా సియా రాఘవ్ చేయిని గట్టిగా పట్టుకుంది..
ఇప్పుడు వాళ్ల మధ్య ఉన్న బంధం ప్రపంచంలోని ఏ శక్తినైనా ఎదిరించేంత పటిష్టంగా మారింది..అని అనిపిస్తుంది సియా కి..
కానీ… వాళ్ళకి తెలియని విషయం.. అప్పటికే వారిని అంతం చేయడానికి ఒక భయంకర శక్తి వారిని వెంబడిస్తూ వారి వెనుకే వచ్చింది అని.
సియా రాఘవ్ లు ఎప్పుడు అయితే రిసార్ట్ నుండి బయటి వచ్చారో.. ఆ దట్టమైన అడవి చెట్ల పొదల వెనుక… వాళ్లు ప్రయాణిస్తున్న రెడ్ థార్ జీప్ని చాలా సైలెంట్‌గా
ఒక కార్ ఫాలో అయింది..అందులో వున్నా మెయిన్ హెడ్ ఇంకా తన మెయిన్ షూటర్స్ తో కలిసి కూర్చుని ఉన్నాడు..