** అజేయ – 93 **
*”సార్… వాడు మనిషి కాదు సార్… రాక్షసుడు! మెరుపు కంటే స్పీడ్‌గా ఉన్నాడు! గేట్ దగ్గర ఉన్న ఇద్దరినీ క్షణాల్లో కొట్టేశాడు…
వాళ్ల దగ్గరున్న గన్స్ కూడా ముట్టుకోలేదు సార్! కేవలం ఒంటిచేత్తో… వితౌట్ ఎనీ వెపన్స్… వాళ్ల ఎముకలు విరిచేసి కింద పడేసాడు! సార్… వాడు ఇటువైపే వస్తున్నా…”*
ఆ గార్డ్ మాట పూర్తి కాకుండానే… ఆ గార్డ్ తన మాట పూర్తి చేయకముందే… వాకీ-టాకీ అవతలి వైపు నుండి ఒక సాలిడ్ సౌండ్ రావడం , ఆ వెంటనే ఆ గార్డ్ చేతిలో నుండి వాకీ-టాకీ కింద పడి పగిలిపోయిన క్రంచింగ్ సౌండ్ వినిపించాయి..
ఆ తర్వాత లైన్ పూర్తిగా డెడ్ అయిపోయింది..
ఆ భయంకరమైన ఆర్తనాదం వినగానే… ఆ సీక్రెట్ ఛాంబర్ లోపల ఉన్న విక్రమ్ పర్సనల్ గ్యాంగ్ కమాండోస్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు..